అన్వేషించండి

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో నెయ్యి వివాదం: దేవుడి ఫొటోలతో వైసీపీ నిరసన, గందరగోళం!

Andhra Pradesh Latest News: వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలను మండలిలోకి తీసుకురావడంపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ప్రశ్నించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టీటీడీ నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ అంశాలపై వైసీపీ చర్చ కోరింది.
  • చర్చకు నిరాకరించడంతో వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలు ప్రదర్శించారు.
  • దేవుడి ఫొటోలను మండలిలోకి తేవడంపై అధికార పార్టీ, ఛైర్మన్ అభ్యంతరం తెలిపారు.
  • సభలో గందరగోళం, నిరసనల నేపథ్యంలో ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నెయ్యి వివాదం మరింత ముదురుతోంది. శాసన మండలిలో హెరిటేజ్‌, ఇందాపూర్‌సంస్థ అంశాలపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. అందులో భాగంగా రోజూ వాయిదా తీర్మానాలు ఇస్తూ వస్తోంది. ఎప్పటి మాదిరిగానే మండలి ఛైర్మన్ వాటిని తిరస్కరిస్తున్నారు. శుక్రవారం కూడా వైసీపీ సభ్యులు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ నేతలు తమ వెంట తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిపెట్టిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. 

వైసీపీ సభ్యులు దేవుడి ఫొటోలను మండలిలోకి తీసుకురావడంపై అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ప్రశ్నించింది. దేశ చరిత్రలోనే ఇలాంటివి ఎక్కడా జరగలేదని చెప్పింది. చట్టసభల్లో దేవుడి చిత్రాలు, మతపరమైన థింగ్స్‌ తీసుకురాకుడనే రూల్‌ను అతిక్రమించారని ఆరోపించారు. మంత్రి పయ్యావుల కేశవ‌ మాట్లాడుతూ దేవుడిపై నమ్మకం లేని వారు దేవుడి ఫొటోలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి చర్యలను చైర్మన్ ఖండించాలని డిమాండ్ చేశారు. 

మండలి ఛైర్మన్ కూడా వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సభలో ప్రదర్శించ కూడదని వారించారు. అయినా వైసీపీ సభ్యులు ఆయన సూచనలు పట్టించుకోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీటీడీలో హెరిటేజ్ అక్రమాలకు ప్రభుత్వం వంతపాడుతోందని నిరసన తెలిపారు. ఆ అంశాల్లో చర్చ జరిపితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. 

ఓవైపు ఛైర్మన్, మరోవైపు అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పినా వైసీపీ నేతలు వినిపించుకోలేదు. వారు మండలి ఛైర్మన్‌ పోడియం చుట్టు ముట్టి నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. ఎవరూ తమ సీట్లలో కూర్చోకుండా మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు మండలి ఛైర్మన్ ప్రకటించారు. అప్పటి వరకు వైసీపీ సభ్యులపై ఆగ్రహంతో మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్‌ తన చేతిలో ఉన్న మైక్‌ను విసిరికొట్టారు. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నెయ్యి వివాదం ఎందుకు ముదిరింది?

టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, హెరిటేజ్, ఇందాపూర్ సంస్థల అంశాలపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టడం వల్ల వివాదం ముదిరింది.

శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఎలాంటి నిరసన తెలిపారు?

వారు వెంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిపెట్టిన ఫ్లెక్సీలను ప్రదర్శించి, నినాదాలు చేశారు.

దేవుడి ఫొటోలను మండలిలోకి తీసుకురావడంపై అధికార పార్టీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది?

దేవుడిని రాజకీయాల్లోకి లాగడం, చట్టసభల్లో మతపరమైన వస్తువులను తీసుకురాకూడదనే నిబంధనను అతిక్రమించారని అధికార పార్టీ ఆరోపించింది.

ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో మండలిలో ఏమి జరిగింది?

వైసీపీ సభ్యుల నిరసన, అధికార పార్టీ సభ్యుల వ్యతిరేక నినాదాల వల్ల మండలిలో గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Embed widget