News
News
వీడియోలు ఆటలు
X

KCR and Jagan Think About This: కర్ణాటక ఎన్నికల ఫలితాల నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే!

వ్యతిరేకత ఉందంటూ భారీ గా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిన బీజేపీ 

అయినా గానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తప్పని ఓటమి 

ఏపీ, తెలంగాణల్లో సిటింగ్ ఎమ్మెల్యే లను మార్చేస్తా మంటున్న జగన్, కేసీఆర్

FOLLOW US: 
Share:

కర్ణాటక ఎన్నికలు అధికార పార్టీ నేతలకు ఒక ముఖ్యమైన పాఠాన్ని తెలిపాయి అనడం లో ఎలాంటి అనుమానం లేదు. ఎన్నికలకు ముందు పలు దఫాల్లో అభ్యర్థుల లిస్ట్ లను విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందంటూ చాలా మంది అభ్యర్థులను మార్చేసింది. సిటింగ్ ఎమ్మెల్యే లను సైతం పక్కన పెట్టింది. నిజానికి ఎన్నికలకు చాలా కాలం ముందు నుంచే రూలింగ్ పార్టీ బీజేపీపై కర్ణాటకలో వ్యతిరేకత బలంగా వినిపిస్తుండడంతో ముందు జాగ్రత్తగా ఇలా సాంప్రదాయ  అభ్యర్థుల స్థానంలో కొత్త మఖాలను తెర మీదకు తెచ్చింది. దీనివల్ల వ్యతిరేకత ఎదుర్కొటుంది అభ్యర్థులే తప్ప ప్రభుత్వం కాదు అనే సంకేతాల్ని పంపే ప్రయత్నం చేసింది . 

తొలి జాబితా లో 52 మంది తరువాత జాబితాలో 23 మందిని పక్కన బెట్టిన బీజేపీ 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమపై వస్తున్న వ్యతిరేకత గుర్తించిన బీజేపీ ప్రభుత్వం దానికి అభ్యర్థులనూ .. పార్టీ నేతలనూ బాధ్యులను చేస్తూ మొదటగా విడుదల చేసిన క్యాండిడేట్ లిస్ట్ లో ఏకంగా 52 మందిని మార్చేసింది . మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఫస్ట్ లిస్ట్ ను 189 మందితో రిలీజ్ చేసింది. దానిలో 52 మంది కొత్త అభ్యర్థులున్నారు. అలాగే 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యి చూపింది బీజేపీ. ఒకరోజు గ్యాప్ లో విడుదల చేసిన రెండో జాబితాలో 23 మంది అభ్యర్థులు ఉండగా వారిలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు.

తరువాత 10 మందితో మూడో జాబితా రిలీజ్ అయింది. ఇలా విడతల వారీగా జాబితాలు రిలీజ్ చేస్తూ సిట్టింగ్ లకూ పార్టీకి మొదటినుంచీ అండగా ఉన్నవారిని పక్కన బెట్టి వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొత్తవారిని తెరమీదకు తెచ్చారంటూ సీట్ కోల్పోయిన వారు పార్టీపై భగ్గుమన్నారు. అలాంటి వారిలో మాజీ సీఎం, 6 సార్లు ఎమ్మెల్యే  జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సవధి లాంటి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత ఏం జరిగిందో అందరూ గమనించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత , అవినీతి ఆరోపణలకు ఎమ్మెల్యే లను, సీనియర్ లను  బాధ్యులను చేస్తూ బీజేపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం బూమ్ రాంగ్ అయింది. 

ఇదే ఫార్ములా ఫాలో అవుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్!  
తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తాను చేయించిన సర్వేలో అంచనాలు అందుకోని వారికి మళ్ళీ ఎమ్మెల్యే సీటు ఉండదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పార్టీ మీటింగ్ లలో ఎమ్మెల్యేలకు అల్టిమేటం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 175 కు 175 రావాల్సిందే అనీ.. గెలుపు గుర్రాలకే ఎమ్మెల్యే టికెట్స్ అని చెప్పేశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తమ ఎమ్మెల్యేలకు ఇలానే చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారికి సీట్లు లేవంటూ స్పష్టం చేసేవారు. అయితే వాళ్ళు మరిచిపోయిన ఒక పాయింట్ ఒకటి ఉందని కర్ణాటక ఎన్నికల ఫలితాలు  చెబుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ప్రభుత్వ వ్యతిరేకత అభ్యర్థుల మార్పుతో పోదు..! 
రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత రావడం అంటూ జరిగితే అది అభ్యర్థుల మార్పుతో పోదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉమ్మడి ఆంధ్రాలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం దీనికి మినహాయింపు కాదు. ఈ వాస్తవాన్ని గమనించకుండా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ వేసిన అంచనాలు తప్పడమే కాకుండా అధికారాన్ని దూరం చేశాయి. మరి ప్రస్తుతం అదేబాటలో ఉన్నట్లు కనపడుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ వ్యూహాన్ని మారుస్తారా లేక తమ పద్దతే కరెక్ట్ అంటారో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సి ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.

Published at : 13 May 2023 08:38 PM (IST) Tags: YS Jagan KCR Karnataka Results Karanataka Election Results 2023 Karanataka

సంబంధిత కథనాలు

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Pawan Kalyan - OG : రాజకీయాలు రాజకీయాలే, సినిమాలు సినిమాలే - పవన్ షూటింగులు ఆగట్లేదు! 

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Allu Arjun - Telugu Indian Idol 2 : గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన అల్లు అర్జున్ - ఇంటికెళ్లాక పరిస్థితి ఏంటో?

Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!

Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!