AP CM Jagan Vizag Tour : కొత్తగా లక్ష మందికిపైగా ఇళ్ల పట్టాలు - గురువారం విశాఖ జిల్లాకు జగన్ !
గురువారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు ఆప్షన్ త్రీ ఎంచుకున్న లబ్దిదారులకు ఇళ్లను నిర్మించే పనులు ప్రారంభిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) గురువారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగే ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి ( Tadepalli ) నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి జగన్ బయలుదేరి 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడకు ( Paidivada ) చేరుకుంటారు. 11.05 గంటలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకుని తన తండ్రి వైఎస్సార్ ( YSR ) విగ్రహావిష్కరణ చేపట్టనున్నారు. అలాగే పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్ల పరిశీలన, మోడల్ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్ ప్రారంభోత్సవం, ల్యాండ్ పూలింగ్ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్, తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
విజయసాయిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు - సీఎం జగన్‌తో భేటీ తర్వాత కీలక మార్పులు
ముఖ్యమంత్రి జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించి ఆ తర్వాత పట్టాలు, హౌసింగ్ స్కీమ్ మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ( Vizag ) ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 2.25 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోకున్నారు. ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవాలనుకున్న వారికి మూడు ఆప్షన్లు ఇచ్చింది. అందులో మూడో ఆప్షన్ ఎంచుకున్న వారికి ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. ఇలా మూడో ఆప్షన్ ఎంచుకున్న వారి ఇళ్ల నిర్మాణాలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో ఆప్షన్ ఎంచుకున్న వారి ఇళ్ల నిర్మాణాలను కూడా గురువారమే ప్రారంభిస్తారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ ప్రతి వెయ్యి ఇళ్లకు ఓ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను నయమించి సకాలంలో ఇళ్ల నిర్మాణం జరగాలని ఆదేశిచారు.
ఏపీ మహిళా కమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, పోలీసులతో వంగలపూడి అనిత వాగ్వివాదంతో రచ్చరచ్చ
సీఎం జగన్ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్టమైన భద్రతా ( Security ) ఏర్పాట్లు చేస్తున్నారు. గత వారం హర్యానా సీఎంతో భేటీ అయ్యేందుకు విశాఖకు వచ్చినప్పటికీ ఇతర కార్యక్రమాలేమీ పెట్టుకోలేదు. అంతకు ముందు నగరానికి వచ్చినా శారదా పీఠం ( Sarada Peetam ) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చాలా కాలం తర్వాత నగరానికి జగన్ వస్తున్నందున భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు.. దానికి తోడు కొత్త జిల్లాల ఏర్పాటు... మంత్రివర్గంలో అనకాపల్లి ఎమ్మెల్యేకు ( Anakapalli ) చోటు దక్కడంతో భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.