YS Jagan Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతలు - సీఎం జగన్‌తో భేటీ తర్వాత కీలక మార్పులు

YSRCP MP Vijayasai Reddy:  ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పార్టీలో కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మరోసారి ఆయనపై నమ్మకాన్ని ఉంచి కీలక బాధ్యతలు అప్పగించారు.

FOLLOW US: 

YSRCP MP Vijayasai Reddy:  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని చర్చ అలా మొదలయ్యిందో లేదో అంతలోనే కీలక బాధ్యతలు దక్కించుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నిర్ణయం మేరకు రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షుల, పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు విజయ సాయిరెడ్డికి కట్టబెడుతూ వైసీపీ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది . కొన్ని రోజుల కిందట వైఎస్సార్‌సీపీలో మార్పులూ చేర్పులు చేసిన సీఎం జగన్.. విజయసాయిరెడ్డిని  పక్కన బెట్టారు అనే ప్రచారం జరిగింది. 

తిరుపతిలో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకు పార్టీ కీలక నేతలు హాజరుకాకపోవడం, సీఎం జగన్‌కు నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది అని ఊహాగానాలు కూడా తోడవడంతో పాటు పార్టీ అనుబంధ సంస్థల ఇంచార్జ్‌గా మాత్రమే విజయసాయిరెడ్డిని నియమించడంతో ఆ ఎంపీ పని అయిపొయింది అనే చర్చ సైతం మొదలైంది. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో సైతం విజయ సాయిరెడ్డికి పెద్ద ప్రాధాన్యత దక్కలేదు అని పార్టీలోనే కొందరు అభిప్రాయపడ్డారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం తనను అనుబంధ సంస్థల ఇంచార్జ్ గా మాత్రమే నియమించడంపై  సంయమనంగానే స్పందిస్తూ పార్టీ అధినేత జగన్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించడమే తన పని అని చెప్పారు. కిఅయితే రాత్రికి రాత్రే తాడేపల్లికి వెళ్లి  పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి తనపై వస్తున్న ఆరోపణలపై విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చినట్టు సమాచారం. 

తనను కలిసిన విజయసాయిరెడ్డి పార్టీలో ప్రస్తుత పరిణామాలపై చర్చిండంతో పాటు కొన్ని అంశాలపై ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందారో లేక ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నారో గానీ  ఎంపీకి మళ్లీ కీలక బాధ్యతలు దక్కాయి. రాష్ట్రంలో రీజనల్ కో -ఆర్డినేటర్లతో పాటు జిల్లా అధ్యక్షుల బాధ్యతలు సైతం విజయసాయిరెడ్డికి అప్పగిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంతకుముందు ఆ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)కి ఎమ్మెల్యేల -మీడియా కోర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.

వారికి షాక్ ఇచ్చినట్లేనా !
ఇన్నాళ్లూ విశాఖ ప్రాంతంలో పార్టీ పరంగా తిరుగులేని స్థాయిలో ఉన్న విజయసాయిరెడ్డిని ఇటీవల పదవుల నుంచి తప్పించి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, రీజనల్ కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డిలను నియమించారు. అలాగే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా విడదల రజనికి బాధ్యతలు ఇవ్వడంతో విజయసాయిరెడ్డి ఇక విశాఖకు దూరం కావడం తథ్యం అనుకున్నారు కొందరు. పైగా విశాఖ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో ఇక్కడ మొత్తం తామే కీలకం అనే భావన ఆయా నేతల వర్గాలు భావించాయని ప్రచారం జరిగింది. అదే సమయంలో విజయసాయిరెడ్డి మళ్ళీ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతో ఆయనపై దుష్ప్రచారం చేసిన వారికి షాక్  ఇచ్చినట్టేనని అంటున్నారు విశ్లేషకులు .

Also Read: Jagan Vijayasai Reddy: సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి గ్యాప్ నిజమేనా? వైఎస్సార్‌సీపీ అధినేతకు ఆ ముగ్గురే ముఖ్యమా! 

Also Read: Nellore Politics : నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టం, అనిల్ కుమార్-కాకాణి గోవర్థన్ భేటీ

Published at : 27 Apr 2022 08:15 AM (IST) Tags: YS Jagan YSRCP vijayasai reddy Sajjala Ramakrishna Reddy YS Jagan Mohan Reddy AP News

సంబంధిత కథనాలు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు

Vizag Yarada Beach: మూడు రంగుల్లో ఎంతో ఆహ్లాదకరంగా యారాడ బీచ్‌ - వీడియో ట్వీట్ చేసిన ఎంపీ ప‌రిమ‌ళ్ న‌త్వానీ

Vizag Yarada Beach: మూడు రంగుల్లో ఎంతో ఆహ్లాదకరంగా యారాడ బీచ్‌ -  వీడియో ట్వీట్ చేసిన ఎంపీ ప‌రిమ‌ళ్ న‌త్వానీ

Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !

Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !

Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

Tammineni Seetharam : కుళ్లి, కృశించిపోయిన టీడీపీకి మహానాడులో దహన సంస్కారాలు, స్పీకర్ తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు

Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

Jupudi Prabhakar Rao : శెట్టిబలిజలను క్షమాపణలు కోరిన జూపూడి ప్రభాకర్, 'మత్తులో ఉండి చేశారా' కామెంట్స్ పై వివరణ

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!