AP Assembly YS Jagan : కోవిడ్ వల్ల నష్టపోయాం - చంద్రబాబు తప్పుడు హామీలతో వస్తున్నారు - అసెంబ్లీలో జగన్
AP Assembly : కరోనా వల్ల ఆర్థికంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని సీఎం జగన్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
AP Assembly YS Jagan : గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని సీఎం జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మాట్లాడారు. ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదని.. పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదన్నారు. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలిఅలాంటి పవర్‌హౌజ్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం .. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది ..అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నానన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం .. ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి
ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు.
2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతమేనన్నారు. 15వ ఆర్థిక సంఘం 41 శాతం సిఫారసు చేసిన మనకు 31 శాతం మాత్రమే దక్కిందన గుర్తు చేశారు. బాబు హయాంలో 35 శాతం వరకైనా తగ్గింది. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ బాగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా 2023-23లో 38 000 కోట్లకు చేరుకుందన్నారు. కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయామని.. ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులూ పెరిగాయన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు ... ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఐదేళ్లు పాలించామనితెలిపారు.
లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన అందించామని.. రూ.2లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని జగన్తెలిపారు. నాన్ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించామన్నారు. దురదృష్టవశాత్తూ మనకు శత్రువులు ఎక్కువ .. గోల చేసే వాళ్లు ఎక్కువ.. ఒకే విషయాన్ని మళ్లీమళ్లీ చెబుతూ గందరగోళం సృష్టించే వాళ్లూ ఎక్కువేనన్నారు. జగన్ కేవలం బటన్‌లు మాత్రమే నొక్కుతూంటారన్నది కూడా అబద్ధమన్నారు. ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తక్కువేనన్నారు. విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినవి.. చేసిన అప్పులు .. గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం రూ. 1,53,000 కోట్లు ఉందన్నారు. బాబు హయాంలో అప్పులు పెరగింది 21.87 ఏడాదికైతే... మన హయాంలో ఇది 12.13 శాతం మాత్రమేనన్నారు. అంటే.. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశామని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు హయాంలో ఏ కుటుంబానికి మంచి జరగలేదని జగన్ ఆరోపించారు. ఆయన హయంలో సంక్షేమ పథకాలు లేవు..14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉందని చంద్రబాబు అంటున్నారు .. రాష్ట్రానికి ప్రజలకు పనికిరాని అనుభవం ఎందుకని ప్రశ్నించారు. తాను చేయని అభివృద్ధిన తానే చేశానని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరమని.. మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చేసి చూపించామని జగన్ చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం.. పేదలకు అండగా నిలిచామన్నారు. చంద్రబాబు కొత్త కొత్త వాగ్ధానాలతో గారడీ చేస్తున్నారు..ఇప్పటికీ చంద్రబాబు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగలేకపోతున్నారు ..ఇన్ని కుట్రలు, పొత్తులు, కుతంత్రాలు ఎందుకని జగన్ ప్రశ్నించారు.