అన్వేషించండి

CM Jagan: కాపు నేస్తం నిధులు విడుదల.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వెనక్కి తగ్గట్లే

వైఎస్ ఆర్ కాపు నేస్తం నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద నిధులు అందించడం ఇది.. వరుసగా రెండోసారి. 3.27 లక్షల మంది ఖాతాల్లోకి సీఎం జగన్ నిధులు జమ చేశారు.

ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. అర్హులైన 3 లక్షల 27 వేల 244 మంది మహిళల ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమయ్యాయి. సీఎం జగన్ ఈ నిధులను విడుదల చేశారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఈ నిధులు జమ అయ్యాయి. ప్రభుత్వం జమ చేసిన నగదును బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా.. అన్ ఇన్ కమ్ బర్డ్ అకౌంట్లలో జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఈ నిధులను విడుదల చేశారు.

కాపు నేస్తం నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. 'నిరుపేద కాపు మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం' అందిస్తున్నాం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్థిక సాయం అందుతోంది. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం.' అని సీఎం జగన్ చెప్పారు.

ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం'కు శ్రీకారం చుట్టామని జగన్ చెప్పుకొచ్చారు. కిందటి ప్రభుత్వం చెప్పిందేంటి.. చేసిందేంటి.. అని ఓ సారి గుర్తు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి సంవత్సరం 1,500 కోట్లు ఇస్తామని చెప్పి.. కనీసం ఏడాదికి రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వరుసగా రెండో ఏడాది కూడా కాపు నేస్తం నిధులను విడుదల చేశామని జగన్ చెప్పారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. అర్హత ఉన్నవారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాత బకాయిలకు కాపు నేస్తం నగదు జమ చేసుకోకూడదని బ్యాంకులకు సూచించామన్నారు. రెండేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.982 కోట్ల జమ చేసినట్లు జగన్‌ తెలిపారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. 

కొన్ని రోజులుగా కాపు నేస్తంపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే జరిపింది. వార్డు వాలంటీర్లు అర్హులకు సంబంధించిన వివరాలను సేకరించారు. సచివాలయాల్లో అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం తుదిజాబితాకు ప్రభుత్వం ఆమోదం  తెలిపింది. అలా మెుత్తం 3.27 లక్షల మంది అర్హులకు నగదు జమ అయింది. నగదు అకౌంట్ లో పడినట్లు మహిళల ఫోన్లకే మెసేజ్ వెళ్లనుంది. ఒకవేళ ఏదైనా అనుమానాలు ఉంటే.. బ్యాంకుకు వెళ్లి కూడా.. డబ్బులు జమ అయ్యాయో.. లేదో.. చూసుకోవచ్చు.

Related Video: YSR Kapu Nestham: 3.27 లక్షల మంది ఖాతాల్లోకి.. రూ.490.86 కోట్లు విడుదల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget