Jagan : విశాఖ శారదాపీఠంలో సీఎం జగన్ - రాజశ్యామల యాగం నిర్వహణ
విశాఖ శారదాపీఠంలో సీఎం జగన్ రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు జగన్ హాజరయ్యారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ శారదా పీఠంలో పర్యటించారు. శారదా పీఠంలో మూడో రోజు కొనసాగుతున్న రాజశ్యామలాదేవి యాగంలో పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రుద్ర హోమం పూర్ణాహుతికి సీఎం హాజరయ్యారు.
రాజశ్యామలా యాగంలో పాల్గొనే ముందు సీఎం జగన్ విజయ గణపతి, శంకరాచార్య, వనదుర్గ ఆలయాల సందర్శించారు. రాజశ్యామల పూజ కోసం వేద పండితులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సంకల్పం చేయించారు. తర్వాత సీఎం చేతులమీదుగా కలశ స్థాపన చేయించారు. అనంతరం వేద పండిత సభలో ఆయన పాల్గొన్నారు. రాజశ్యామలాదేవి యాగంలో సీఎం వైఎస్ జగన్‌తోపాటు మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఏటా మాఘ మాసం పంచమి నుంచి దశమి వరకు శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు జరుగుతాయి. దేశ రక్షణ కోసం 5 రోజుల పాటు శారదా పీఠం రాజ్యశ్యామల అమ్మవారి యాగం నిర్వహిస్తూ వస్తోంది. ఈ సారి కరోనా కారణంగా నిరాడంబరంగా ఉత్సవాలు చేయాలనుకున్నారు. అందుకే సీఎంజగన్ ఒక్కరినే వీఐపీని ఆహ్వానించారు. రాజశ్యామల యాగం తర్ాత శారదాపీఠం నిర్వహణలోని జగద్గురు శంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తీర్ణతా పత్రాలు, మెడల్స్ అందజేశారు.
ఏపీకి న్యాయం కోసం ఇప్పటికైనా పోరాడాలి - మోదీ వ్యాఖ్యలపై సీఎం జగన్‌కు ఉండవల్లి సలహా !
ప్రత్యేకంగా శారదాపీఠం కార్యక్రమంలో పాల్గొనేందుకే విశాఖ పర్యటనకు వచ్చిన జగన్ .. ఆ తర్వాత వెనుదిరిగారు. ప్రత్యేకమైన కార్యక్రమాలేమీ పెట్టుకోలేదు. శారదాపీఠం స్వరూపానందతో సీఎం జగన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా పీఠంలో జరిగే కార్యక్రమాలకు జగన్ ప్రత్యేకంగా హాజరవుతూ ఉంటారు. పీఠంతో ప్రత్యేకమైన అనుబంధం సీఎం జగన్‌కు ఉన్నందున ఆయను మాత్రమే వీఐపీని ఆహ్వానిచామని శారదాపీఠాధిపతి స్వరూపానంద కూడా మీడియాకు చెప్పారు.
మంత్రి సిదిరి అప్పలరాజుకు చేదు అనుభవం.. అలిగి వెనక్కి తగ్గిన మంత్రి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

