అన్వేషించండి

CM Jagan : హంతకులకు మద్దతిస్తూ వస్తున్నారు - నా చెల్లెళ్లను నాపై యుద్ధానికి తెస్తున్నారు - ప్రొద్దుటూరు సభలో జగన్

YSRCP : బాబాయ్ హంతకులకు మద్దతిస్తూ రోడ్లపై ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. తనపై తన చెల్లెళ్లను యుద్ధానికి తెస్తున్నారని ఆరోపించారు.

CM Jagan  comments in Proddutur Sabha : బాబాయ్‌ను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆ దేవుడికి కడప  జిల్లా ప్రజలకు బాగా తెలుసుని ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్ వ్యాఖ్యానించారు.  వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి.. అతిహీనంగా బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడని .. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని అన్నారు.   ఆ చంపినోడు ఉండాల్సినోడు జైల్లో.. నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన వారేనని.  చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు తన వాళ్లు అన్నారు.  చిన్నాన్నను అన్యాయంగా చంపారు.  ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బ తీసే రాజకీయం చేస్తున్నారు, ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి? అని జగన్ ప్రశఅనించారు.  ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని.  ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం.. నేను మాత్రం ప్రజల పక్షం అని గర్వంగా చెబుతున్నానన్నారు. 

ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేసే వ్యక్తి చంద్రబాబు అన్నారు. శవరాజకీయాలు, కుట్రలు ఆయనకు అలవాటు కుట్రలు చాలవన్నట్లు.. నా చెల్లెలిద్దరిని తీసుకొచ్చుకున్నారని ఆరోపించారు.ఆ దేవుడు, ఆ ప్రజల్నే నమ్ముకున్నా.. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నానని జగన్ అన్నారు. పేదల ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడుతున్నా ఈ దుష్ట చతుష్టయాన్ని చిత్తుగా ఓడించేందుకు పాంచజన్యం పూరించేందుకు శ్రీకృష్ణుడిలా మీరంతా సిద్ధమేనా అని జగన్ ప్రశఅనించారు.  మే 13న ఫ్యాన్‌ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి ఓట్లు వేయించి మనందరి పార్టీని గెలిపించేందుకు, అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రజల్ని అడిగారు. వైఎస్సార్‌ జిల్లా నేలమీద... ఈ పొద్దుటూరు గడ్డమీద...నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు.  

ఈ రోజు నా ముందు కనిపిస్తున్న స్థాయిలో ఈ జిల్లాలో ఎప్పుడూ సమావేశం జరిగి ఉండదు. ఓ మహా సముద్రం కనిపిస్తోంది. మంచికి మద్దతు పలికే ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా జైత్రయాత్రకు ముందు వరసలో మన వైఎస్సార్‌సీపీ పార్టీ జెండా తలెత్తుకుని ఎగురుతోంది ఇక్కడేనని తెలిపారు. అధికారాన్ని పేదల భవిష్యత్తు కోసం రైతులు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, భావితరాలు, మన గ్రామాలు, ఇంటింటి అభివృద్ధి, సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ 58 నెలల పాలనలో ప్రతి రంగంలోనూ విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకొచ్చాం. ఎప్పుడూ జరగని విధంగా.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయలు లంచాలు, వివక్ష అనేవి లేకుండా నేరుగా ప్రజల చేతుల్లో ఉంచి ప్రజా ప్రభుత్వ అజెండా.. ఇక్కడ కనిపిస్తున్న మన జెండా అని స్పష్టం చేశారు. 

డ్రగ్స్ కేసుపైనా సీఎం జగన్ స్పందించారు.  చంద్రబాబు వదినగారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ దిగుమతిచేస్తావుంటే సీబీఐ వాళ్లు రెయిడ్‌ చేశారు. ఈ రెయిడ్‌ జరిగిందని తెలిసిన వెంటనే.. యెల్లో బ్రదర్స్‌ ఉలిక్కి పడ్డారు. దొరికితే తమ బ్రదర్‌ కాదని.. మన బ్రదర్‌ అని మన మీద నెట్టేసే యత్నం చేశారని ఆరోపించారు.  ఈ జెండా తలెత్తుకుని ఎగురుతోంది అని.. రాష్ట్రంలో ఎ‍క్కడికి వెళ్లినా, చూసినా కోట్ల గుండెలు, మన పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అంటున్నాయి!కాబట్టే ఈ జెండా మరే ఇతర జెండాతోనూ జతకట్టడం లేదని స్పష్టం చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget