Chandrababu : ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !
వరదలొచ్చి ప్రజలు చనిపోతూంటే సీఎం జగన్ పట్టించుకోవడం లేదని.. అందుకే అధికారులూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు వరద బాథిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు.
వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రెండో రోజు చిత్తూరు జిల్లా పాపానాయుడు పేటను పరిశీలించారు. అక్కడ వరద బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని బాధితులు పలువురు చంద్రబాబుకు వివరించారు. అక్కడి నష్టాన్ని చూసి చంద్రబాబు చలించిపోయారు. ప్రభుత్వానికి ముందు చూపు ఉంటే ప్రజలకు ఇటువంటి కష్టాలు వచ్చేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గాల్లో వచ్చి గాల్లో వెళ్తున్నాడని..అందుకే అధికారులూ కూడా పట్టించుకోవడం లేదని విమర్శించాు. ప్రజలు చచ్చిపోయిన తరువాత అధికారులు వచ్చి కష్టం తీరుస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి బుద్ది, జ్ఞానం ఉంటే వరద బాధితులకు తక్షణం సాయం అందించాలన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తా..మీ కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు.
Also Read : రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !
40 ఏళ్ళుగా ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నానని.. ఎప్పటికి వెనుక్కు తిరిగి చూడనని స్పష్టం చేశారు. వరదలకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై కొండలు,గుట్టులకు చేరుకున్నారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. మానవ తప్పిదం కారణంగానే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ప్రజల కోసం పోరాడుతూంటే తనను వ్యక్తిగతంగా కించ పరిచి కుటుంబసభ్యుల మీద వ్యాఖ్యలు చేస్తూ ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కొంత మంది పోలీసులు తోకలు జాడిస్తున్నారని.. మళ్లీ అధికారులు, పోలీసులు తన దగ్గర పని చేస్తారని అప్పుడు వారి సంగతి చూస్తానని హెచ్చరించారు.
Also Read : మంత్రిని నిలదీసిన ఘటనతో తీవ్ర ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్టు..
తనను రెండున్నరేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పెట్టారని.. తన ఇంటిపై దాడి చేసేందుకు రౌడిలు వచ్చారన్నారు. తనపై బాంబులు వేసినప్పుడు సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి రక్షించారని.. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న దాడులను తట్టుకోలేనా అని ప్రశ్నించారు. తాను ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తెస్తే వైఎస్ఆర్‌సీపీ నేతలు అందులో వాటాలు కావాలని బెదిరించి తరిమేస్తున్నారని మండిపడ్డారు. మాఫియాల మాదిరిగా వైఎస్ఆర్‌సీపీ నేతలు మారి.. దొంగ ఓట్లు, రౌడీయిజంతో గెలిచారని విమర్శించారు.
Also Read : ప్రజలంతా కష్టాల్లో ఉంటే.. సీఎం జగన్ విందులు, వినోదాల్లో ఉన్నాడు
సీఎం జగన్‌కు అసలు పరిపాలనపై అవగాహన లేదని.. అమరావతి విషయంలో సీఎం రోజులు ఒక్కో మాట మారుస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక తుగ్లక్ మడపతిప్పను మాట తప్పను అన్న జగన్ ఇప్పుడు చేస్తుంది మాత్రం మాట తప్పడం..మడమ తిప్పడమేనన్నారు. రైతులు వరి వేయవద్దు అని మంత్రి ప్రకటించడాన్ని తప్పు పట్టారు. రైతులు వరి వేయకుండా గంజాయి వేయాలా అని ప్రశ్నించారు. జగన్ సర్కార్ ప్రజాహితం కోసం పని చేయడం లేదని..ప్రజలకు టిడిపి అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. పర్యటనకు బయలుదేరే ముందు తిరుపతిలో పంట నష్టంపై ఫోటోలను పరిశీలించారు.
Also Read: TG Venkatesh : రాజధాని ఫార్ములా రెడీ.. జగన్ సై అంటే బీజేపీని ఒప్పిస్తానన్న ఎంపీ టీజీ వెంకటేష్ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి