Kanigiri Chandrababu : టీడీపీ రాగానే తక్కువ ధరకు నాణ్యమైన మద్యం - కనిగిరిలో చంద్రబాబు హామీ !
Chandrababu : టీడీపీ అధికారంలోకి రాగానే తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కనిగిరిలో రా కదలిరా సభలో ప్రసంగించారు.
Kanigiri Chandrababu Specch : జగన్ నాసిరకం మద్యం అమ్మి పేదల రక్తం తాగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కనిగిరిలో తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలి రా బహిరంగసభలో ప్రసంగించారు. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ( CM JAGAN ) ఏపీని మరో 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) పేర్కొన్నారు. పులివెందుల నుంచి వచ్చి చీమకుర్తి గ్రానైట్ దోచుకుంటున్నారు. కనిగిరి ప్రాంత ప్రజలు పేదరికంలో ఉన్నా....ఇతర ప్రాంతాల వలస వెళ్లి స్థిరపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వా కనిగిరి రూపురేఖలు మారుస్తాను. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నినాదం. దేశంలో మొదటిసారి రెండు రూపాయలకే ఎన్టీఆర్ బియ్యం ఇచ్చారు. ప్రజలకి జగన్ ఇప్పుడు 10రూపాయలు ఇచ్చి 100 దోచుకుంటున్నారు. జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదన మండిపడ్డారు.
అప్పుడు ముద్దులు - ఇప్పుు గుద్దులు
2019 లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు మోసపోయామని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు. రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్లలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే....జగన్ గంజాయి ఇస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో వీరబాదుడు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయన్నారు. జగన్ దోపిడీ వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయి. చెత్త నుంచి సంపద సృష్టించాలని మేం ప్రయత్నించాం. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తే జగన్ ట్రాక్టర్ ఇసుకకి 5000 వేల రూపాయలు వసూలు చేస్తున్నాడని మండిపడ్డారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు బదిలీలు
ఎన్నికల్లో ఓడిపోతామని జగన్ లో భయం మొదలైందని పేర్కొన్నారు. అందుకే సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నాడని... మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ట్రాన్స్ ఫర్లు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గంలో చెత్తను తీసుకెళ్లి మరో నియోజకవర్గంలో పడేస్తున్నాడని, అలా చేసినంత మాత్రాన చెత్త కాస్తా బంగారం అవుతుందా తమ్ముళ్లూ...? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇలా ట్రాన్స్ ఫర్లు ఉంటాయని తానెప్పుడూ వూహించలేదని చంద్రబాబు సెటైర్లు వేశారు. "మీ ఇంట్లో చెత్తను ఎక్కడేస్తాం... చెత్త కుండీలో వేస్తాం. కానీ ఈ ముఖ్యమంత్రి చెత్తను తీసుకెళ్లి వేరే నియోజకవర్గంలో వేస్తాడంట! ఇక్కడి పార్లమెంటు స్థానం పరిధిలో ఏడుగురు ఎమ్యెల్యేలు ఉన్నారు.
కనిగిరి ఎమ్మెల్యే మనీ సూదన్
ఇక్కడొక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు... బుర్రా మధుసూదన్. మధుసూదన్ కాదు... 'మనీ'సూదన్. అతడికి అన్నింట్లో వాటా కావాలి. అన్నింట్లో దోపిడీనే. అతడిని ఇంకా ఎందుకు మార్చలేదని అడుగుతున్నా. యర్రగొండపాలెంలో ఇంకొకాయన ఉన్నాడు... బట్టలిప్పేసి తిరుగుతుంటాడు. ఆయనొక మంత్రి. ఇప్పుడాయనకు ట్రాన్స్ ఫర్ వచ్చింది. తీసుకెళ్లి కొండేపిలో పడేశారు. యర్రగొండపాలెంలో చెత్త కొండేపిలో బంగారం అవుతుందా? అని ప్రశ్నంచారు. మార్కాపురంలో మరొకాయన ఉన్నాడు... ఆయన ఒక నయీం, ఆయన తమ్ముడొక చోటా నయీం. ఈ పేర్లను స్థానికంగానే పిలుచుకుంటున్నారు. ఇంకొకాయన గిద్దలూరులో ఉన్నాడు. ఆయన నావల్ల కాదు, నేను పోటీ చేయను అని పారిపోయాడు. దర్శిలో మరొకాయన ఉన్నాడు. ఎక్కడి చూసినా వాటాలు కావాలి... ఇప్పుడాయనకు సీటే లేదు పొమ్మన్నాడన్నారు. ఒంగోలులో ఇంకొకరు ఉన్నారు. మొదట్లో జిల్లా అంతా నాదే, రాష్ట్రమంతా నాదే అన్నాడు. అతడు ఇప్పుడెక్కడున్నాడు తమ్ముళ్లూ... అడ్రస్ గల్లంతైపోయింది. గతంలో కొండేపిలో ఒక అనామకుడ్ని పెట్టారు... ఇప్పుడాయన అడ్రస్ ఎక్కడుందో మనందరం వెతుక్కోవాలి! ఇది రాజకీయమా? నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన తప్పులకు, ఎమ్మెల్యేలను బలిపశువులను చేశారు" అని చంద్రబాబు మండిపడ్డారు. .
నన్ను, పవన్ కల్యాణ్ ను తిట్టాలంట!
ఈ జిల్లాలోనే ఓ ఎమ్మెల్యేకు ఏం చెప్పారో చూడండి. నన్ను, పవన్ కల్యాణ్ ను తిట్టాలంట. మమ్మల్ని తిడితేనే అతడికి టికెట్ ఇస్తారంట. ఎమ్మెల్యే సీటు కావాలన్నా, ఎంపీ సీటు కావాలన్నా ఎంత సేవ చేశాం అని కాదు... చంద్రబాబును ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేశ్ ను ఎంత తిట్టావు, పవన్ కల్యాణ్ ను ఎంత తిట్టావు? అనే అంశాల ఆధారంగా టికెట్లు ఇస్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం... మాకు సంస్కారం ఉంది, మేం తిట్టం, నువ్వు సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదు అని చెప్పారు. వాళ్లను నేను గట్టిగా అభినందిస్తున్నాన్నారు.