X

Chandrababu House Attack: చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ... రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు... నకరికల్లులో అయ్యన్నపై కేసు

చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలపై తాడేపల్లి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. జోగి రమేశ్‌ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు, టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశారు.

FOLLOW US: 

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్ద శుక్రవాం జరిగిన ఘర్షణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేయగా, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. శుక్రవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌ తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి కర్రలు, రాళ్లతో వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీఛార్జ్ కూడా చేశారు. 

అయ్యన్నపాత్రుడిపై కేసు

చంద్రబాబు నివాసం వద్ద దాడి ఘటనకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నకరికల్లు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంపై నాలుగు సెక్షన్​ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు గత రాత్రి నుంచి ఎక్కడ ఉన్నారనే విషయంపై ఆరా పోలీసులు తీస్తున్నారు. తమ ఫిర్యాదులపై పోలీసులు స్పందించడంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

జోగి రమేష్ పై కేసు

చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్​పై కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్​లో టీడీపీ ఫిర్యాదు చేసింది. కుట్ర పూరితంగా చంద్రబాబు ఇంటిపై దాడికి చేశారని జోగి రమేష్​ను అరెస్టు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు న్యాయబద్దంగా విచారణ చేసి జోగి రమేష్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

గవర్నర్ కు ఫిర్యాదు

చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ ఘటనపై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, ఆలపాటి రాజాతో కూడిన బృందం గవర్నర్ ను కలసి నిన్న జరిగిన సంఘటనపై వివరాలు అందజేయనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దండయాత్రగా చంద్రబాబు నివాసం పైకి వచ్చాడని సీసీటీవీ వీడియోలను సాక్ష్యాలుగా అందజేయనున్నారు.

Also Read: Rajamahendravaram News: రాజమహేంద్రవరంలో రాజకీయ వేడి... ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ... రంగంలోకి దిగిన ఫాలోవర్స్

దండయాత్ర కాదు నిరసన 

టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు చంద్రబాబు ఇంటికి వెళితే దండయాత్ర అంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ అన్నారు. చంద్రబాబును కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లానన్నారు. తన వెంట వైసీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని చెప్పారు. తన కారు అద్దాలు పగులగొట్టారని, దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. అయ్యన్న వ్యాఖ్యలపై బాధ కలిగి నిరసన తెలపడానికి వెళ్తే తన కారుపై రాళ్లేశారని ఆరోపించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల పట్ల చంద్రబాబు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతామన్నారు. 

Also Read: Political Foul Language : తిట్లకు తిట్లే సమాధానం ! ఏపీ రాజకీయాలు దారి తప్పాయా !?

Tags: AP News Jogi Ramesh tdp vs ycp chandrababu house police cases ayyannapatrudu

సంబంధిత కథనాలు

Cm Jagan Covid Review: ఆరోగ్య శ్రీ అమలుపై దేశం మొత్తం మాట్లాడుకోవాలి... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష...

Cm Jagan Covid Review: ఆరోగ్య శ్రీ అమలుపై దేశం మొత్తం మాట్లాడుకోవాలి... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష...

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Kurnool Crime: కర్నూలు జిల్లాలో జంట హత్యలు... కళ్లలో కారం చల్లి వేట కొడవళ్లతో దాడి... ఆపై పెట్రోల్ తో తగలబెట్టిన ప్రత్యర్థులు

Employess Strike : సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

Employess Strike :  సమ్మె చేస్తారు సరే తర్వాతేంటి ? ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్లాన్ బీ ఉందా ?

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

AP Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి

AP Corona Updates: ఏపీలో కరోనా కల్లోలం... ఒక్క రోజే 13 వేలకు పైగా కేసులు, 9 మంది మృతి
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్‌పై సర్కార్ కీలక ప్రకటన.. ఇక వారు కూడా అర్హులే

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Naga Chaitanya in Moscow: మాస్కోలో నాగచైతన్య... ఆయన అక్కడ ఏం చేస్తున్నారంటే?

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Omicron Sub-Variant BA.2: బీ అలర్ట్.. దేశంలో ఆ వేరియంట్ వ్యాప్తే ఎక్కువగా ఉందట!

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి

Snake Vs Hen: గుడ్ల కోసం వచ్చిన పాముతో కోడి ఫైటింగ్.. చివరికి ఏమైందో చూడండి