Rajamahendravaram News: రాజమహేంద్రవరంలో రాజకీయ వేడి... ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ... రంగంలోకి దిగిన ఫాలోవర్స్
జక్కంపూడి కుటుంబం జోలికి వస్తే తోకలు కత్తిరిస్తాం, ఒకసారి ఎంపీగానే మిగిలిపోతారంటూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ నాయకులు హెచ్చరిక. సొంత పార్టీ నేతపై వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు.

రాజమహేంద్రవరంలో వైసీపీ వర్సెస్ వైసీపీ నడుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ ఫాలోవర్స్ తిట్ల దండకం అందుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వెన్నంటి ఉండి, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలపై మోసిన జక్కంపూడి కుటుంబంపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మాసా రామ్ జోగ్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోని తీసుకువచ్చేందుకు కృషి చేసిన వారిపై సింగిల్ మెన్ ఆర్మీగా పార్టీలోకి వచ్చిన వ్యక్తి పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే సహించేది లేదని అన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా...
కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన ఎంపీ దాన్ని ప్రతిఫలం అనుభవిస్తున్నారని మాసా రామ్ జోగ్ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో నెగ్గిన ఎంపీ రాజమహేంద్రవరం పార్లమెంటు అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. గత రెండున్నర సంవత్సరాల కాలంగా రాజానగరం నియోజవర్గం అని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. రైతు భరోసా కేంద్రాలు, రోడ్లు, గ్రామ సచివాలయాలు, గ్రామాలలో ఇతర మౌలిక వసతులు కల్పించారని పేర్కొన్నారు. ఆచరణ సాధ్యం కాని 45 కార్యక్రమాలను అమలు చేస్తామని ఎంపీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. 10 సంవత్సరాల కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పార్టీ కోసం పనిచేశారని గుర్తుచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని తొక్కిపెట్టి కొత్త వారిని వారిని నెత్తి మీద కూర్చోబెడితే సహించేది లేదన్నారు.
తోకలు కత్తిరిస్తామని హెచ్చరికలు
బర్రె కొండబాబు అతని కుమారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తండ్రి ఒక పార్టీ అయితే కొడుకు మరో పార్టీ అని అన్నారు. కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రతిరోజు తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు కొట్టుకునే బర్రె కొండబాబుని తీసుకువచ్చి దివంగత నేత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు ఇచ్చారని తెలిపారు. ఈరోజు తెల్ల బట్టలు వేసుకుని కారులో తిరుగుతున్నారంటే అది జక్కంపూడి కుటుంబం చలవే అని గుర్తించుకోవాలన్నారు. జక్కంపూడి కుటుంబంపై ఆరోపణలు చేస్తే తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు.
Also Read: MLA RK Roja: అయ్యన్న పాత్రుడిపై ఎమ్మెల్యే రోజా ఫైర్
జక్కంపూడి క్రేజ్ చూసి విమర్శలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జె.కే అరుణ మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ వేసుకునే బట్టలపై చూపే శ్రద్ధ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై లేదని విమర్శించారు. ఓ రౌడీ వ్యక్తిని పోత్సహిస్తున్నారని, అతనిపై 8 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. ఎంపీ పబ్లిసిటీని మాని సింపుల్ సిటీగా రాజమహేంద్రవరం పార్లమెంట్ అభివృద్ధికి, ఎస్సీ ఎస్టీల లోన్లు సబ్సిడీలు వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. రచ్చబండ కార్యక్రమం పెట్టి పెద్దరాయుడులా తీర్పులు చెప్పి, అరాచకాలు, సెటిల్మెంట్లు చేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన సచివాలయం ఎందుకని ప్రశ్నించారు. జక్కంపూడి కుటుంబానికి ప్రజలలో వచ్చే ఇమేజ్ తనకు దక్కడం లేదని దుర్బుద్ధితో బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఆపదలో ఉన్న కార్యకర్తలను, నాయకులను అర్ధరాత్రి అయినప్పటికీ జక్కంపూడి కుటుంబం ఆదుకుంటుందని అన్నారు. విభేదాలు వీడి రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.
Also Read: Political Foul Language : తిట్లకు తిట్లే సమాధానం ! ఏపీ రాజకీయాలు దారి తప్పాయా !?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

