అన్వేషించండి

Chandrababu Margadarsi: కుప్పంలో 250 పేద కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు - ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి దశ

P4 :కుప్పంలో 250 పేద కుటుంబాలను చంద్రబాబు దత్తత తీసుకున్నారు.ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి దశ అమలు చేసి ఆయా కుటుంబాల ఆదాయాన్ని పెంచేందుకు సహకారం అందించనున్నారు.

Chandrababu Naidu adopted 250 poor families in Kuppam :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పీ4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో #IAmMargadarsi పోస్టర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

పిలుపునివ్వడమే కాదుఆచరించి చూపిస్తున్నా 

"కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపు ఇస్తున్న నేను.. చెప్పడమే కాదు.. ఆచరించి చూపాలని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. ఈ కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రణాళిక రూపొందిస్తాను. ఐయామ్ ఏ మార్గదర్శి. సమాజంలో పేద-ధనికుల మధ్య అంతరాలు తగ్గించే ఇలాంటి కార్యక్రమాన్ని ఎక్కడా చేపట్టలేదు. గతంలో జన్మభూమి స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేస్తే.. ఇప్పుడు పేదలను ఆదుకునేందుకు పీ4 అమలుకు ప్రణాళికలు చేపట్టాం. ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపొందించాం. పేదలకు చేయూతనిచ్చే పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

 నేటి బంగారు కుటుంబాలే... రేపటి మార్గదర్శులు 

“పీ4లో భాగంగా బంగారు కుటుంబాలుగా నమోదైన వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఇవాళ్టి బంగారు కుటుంబాలు.. రేపటి మార్గదర్శలుగా ఎదగాలన్నదే నా ఆలోచన. సాయం పొందిన సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. దీన్ని విజయవంతంగా అమలు చేయగలిగితే ఈ కార్యక్రమం శాశత్వంగా ఉండిపోతుంది. చాలా మందికి మంచి ఆలోచనలు ఉంటాయి.. ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యాలున్న వారు పేదరికం కారణంగా వెనుకబడిపోతున్నారు. ఇలాంటి వారికి చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఎన్నో కార్యక్రమాలు చేసిన నాకు.. పీ4 కార్యక్రమం మనస్సుకు చాలా దగ్గరగా ఉంది” అని చంద్రబాబు అన్నారు.

 ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్ 

“బంగారు కుటుంబాలుగా నమోదైన వారి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తాం. బంగారు కుటుంబాలు అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది.. వాళ్లు చేయగలిగే పనులేంటీ..? అనే అంశాలపై ఓ పది పాయింట్లతో కూడిన సర్వే చేపడుతున్నాం. వీరి అభివృద్ధికి ఏం చేస్తున్నామనే విషయాన్ని వివరించేందుకు ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికల ద్వారా వారి అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తాం. బంగారు కుటుంబాల స్థితిగతులపై ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష చేపట్టాలి." అని సీఎం అన్నారు. 

 ఆగస్టు 15 నుంచి పీ4 ఫేజ్-1

“ఆగస్టు 15 నుంచి పీ4 మొదటి విడత ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నా దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు పని చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్ర స్థాయి ఉద్యోగి వరకు కృషి చేయాలి. బంగారు కుటుంబాలను.. మార్గదర్శులను గుర్తించే విషయంలో కొన్ని జిల్లాలు ఇంకా మెరుగ్గా పని చేయాలి. వచ్చే 15 రోజుల్లో దీని కోసం గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కసరత్తు చేయాలి. ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి.” అని సీఎం సూచించారు. జూమ్  కాన్ఫరెన్సు ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. సీఎం స్ఫూర్తితో తాను కూడా ఐదు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ ప్రకటించారు. షాజహాన్ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ తరహా కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు సహకరిస్తామని ప్రజా ప్రతినిధులు సీఎంకు హామీనిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget