Anantapur Chandrababu : అనంతను నిండా ముంచిన జగన్ - ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ !
అనంతపురం ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిలిపివేసి ప్రజలకు తీవ్ర నష్టం చేసిందన్నారు.
Anantapur Chandrababu : రాష్ట్రానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని, ప్రాజెక్టులను నిలిపివేసి ప్రజలకు చేస్తున్న నష్టాన్ని గురించి వివరించేందుకు తాను ప్రాజెక్టుల యాత్ర ప్రారంభించానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ఎంత విధ్వంసం చేస్తున్నాడు? ఈ ప్రాంతానికి ఎవరు ఎంత న్యాయం చేశారో తెలియచేయడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చంద్రబాబు తెలిపారు. దేశంలోనే అనంతపురం పేద జిల్లా అని.. నీళ్లు ఇచ్చిన తర్వాత జిల్లా బాగుపడిందన్నారు. అనంతపురానికి నీళ్లు పట్టిసీమ పుణ్యమేనన్నారు. అనంతపురంలో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి వివరించారు.
రాయలసీమ కు గుండెలకాయ బనకచెర్ల. గోదావరి నీరు కృష్ణా మీదుగా బనకచర్ల ద్వారా రాయలసీమకు నీరు చేర్చడం .. గోదావరి నీళ్లు సీమకు ఇవ్వడం నా జీవిత ఆశయం. అనంతపురం జిల్లా రైతాంగానికి ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను. ఎక్కువ ల్యాండ్ ఉండే జిల్లా అనంతపురం. జగన్మోహన్ రెడ్డి ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటాడు. దానిపైనే ఆర్గ్యుమెంట్ పెడుతాడు. ఎంతోమంది పోటీపడినా ఏ ఇబ్బంది రాదని హమీ ఇచ్చా.. ఆరు నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియా ప్రాజెక్టు తీసుకుని వచ్చాను. మూడు నెలల్లో వైసీపీకి ఎక్స్పైరీ వస్తుంది. ఇక జీవితంలో వైసీపీ రాదు. అనంతపురం లో ఫ్యాక్షన్... రౌడీయిజం మళ్ళీ పాత రోజులు వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బడ్జెట్ లో కేవలం 2.35 శాతం ఖర్చు చేస్తే ప్రాజెక్టుల నిర్మాణం ఎలా సాధ్యమని చంద్రబాబు ్రశ్నించారు. మారాల రిజర్వాయర్ ను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది . కాల్వలు పూర్తి చేస్తానని వైసీపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు రూ.4,182 కోట్లు ఖర్చు చేశాం. వైసీపీ నాలుగేళ్లలో చేసిన ఖర్చు కేవలం రూ.515 కోట్ కోట్లు మాత్రమేనన్నారు. జీడిపల్లి-భరవానితిప్ప లిఫ్ట్ కు నాలుగేళ్లలో అంగుళం పని కూడా సాగలేదన్నారు. జీడిపల్లి-పెరూరుకు టీడీపీ ప్రభుత్వం రూ.60 కోట్లు ఖర్చు చేసింది . ఒకప్పుడు అనంతపురం అంటే క్లాక్ టవర్ గుర్తొచ్చేది.. ఇప్పుడు కియా పరిశ్రమ గుర్తొస్తుందన్నారు. గంగా-కావేరి నదుల అనుసంధానం జరిగితే దేశంలో కరువు అనేది ఉండదని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ ఆయకట్టు 4 వేల ఎకరాలు – కియా పరిశ్రమ కోసం గుజరాత్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి . తాను ఇచ్చిన స్పష్టమైన హామీతో కియా పరిశ్రమ అనంతకు వచ్చిందన్నారు.
6 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా పరిశ్రమకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. సాగునీటి రంగానికి చేసిన మోసానికి మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. - అనంతపురం జిల్లాలో మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ను ప్రోత్సహించామని .. మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ను 90 శాతం సబ్సిడీతో అందించామన్నారు. జగన్ అధికారంలోకి వస్తూనే 360 జీవో తీసుకొచ్చాడు .. 198 సాగునీటి ప్రాజెక్ట్ పనులను ప్రీ క్లోజ్ చేశాడన్నారు. ఒక్క రాయలసీమలోనే 102 ప్రాజెక్ట్ లు ప్రీ క్లోజ్ – అనంతపురం జిల్లాలో 38 ప్రాజెక్ట్ లు ప్రీ క్లోజ్ చేశారని ఇప్పటి వరకూ ఆ పనులను మళ్లీ చేయలేదన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధికి జగన్ తన పేరు వేసుకుంటున్నారు – వైసీపీ అధికారంలోకి రాగానే సబ్సిడీ ఎత్తివేతతో సాగు విస్తీర్ణం తగ్గిందని గుర్తు చేశారు.