అన్వేషించండి

Chandrababu Prajagalam : టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు

Andhra : జగన్ పై ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ అన్నారు.

Chandrababu :  అభివృద్ధి వికేంద్రీకరణ , మూడు రాజధానులు పేరిట మూడుముక్కలాటాడిన జగన్ కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా చేశాడా అని, జే టాక్స్, జే బ్రాండ్ పేరిట ప్రజల జేబులు కొల్లగొట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కేంద్రంగా పెట్రోల్ బంకు సర్కిల్ ప్రజా గళం భారీ బహిరంగసభ లో జగన్ పై నిప్పులు చేరిగారు.మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అన్నారు. ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసిన మోసగాడు జగన్ అని,ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డను అని చిన్నాన్నను గొడ్డలి పోటుతో చంపేశారని తీవ్రంగా విమర్శించారు.అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత ఈ దుర్మార్గుడిదేనని, ఫ్యాన్ పీకేసి చెత్తకుండీలో పారేస్తేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
 
ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, ఇక తాడోపేడో తేల్చుకుంటామని సవాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బనగానపల్లెలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం ప్రచారయాత్రలో ఆయన మాట్లాడారు. మొన్నటి వరకు జగన్‌(Jagan) జిల్లాలకు వెళ్తుంటే ఆ వీధులలో ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇంటి ముందు పరదాలుకట్టి పరదాల మాటున తిరిగారని ఆరోపించారు. జగన్‌ నేడు జనాల్లోకి వస్తుంటే జనాలు పారిపోతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గా ఏనాడైనా జనాల్లోకి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోలేదని విమర్శించారు. చిన్నాన్న( వైఎస్‌ వివేకా) ను హత్య చేయించినవారికే సీట్లు ఇచ్చారు. దోషులను మాత్రం పక్కనపెట్టు్కుని తిరుగుతున్నాడని, చెల్లెలును జైలులో పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.  దోపిడి దారుడు, దొంగ జగన్ మోహన్ రెడ్డికి నా వయసు గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు. టిడిపి అభివృద్ధి పనులు చేస్తే కూల్చి వేసే నైజం వైసిపిదని, టిడిపిది విజన్ ,వైసిపి ది పాయిజన్ అన్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె కు పట్టిన శని అని ,వచ్చే ఎన్నికల్లో శని ని వదిలించుకోవాలని ప్రజలకు సూచించారు.

వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన, రవ్వల కొండను మింగేసిన అనకొండ కాటసాని రామిరెడ్డి అని విమర్శించారు. కాటసాని కనుసన్నల్లో నాటు సారా, కమిషన్ల దందా, బొలెరో బ్యాచ్, సెటిల్మెంట్ బ్యాచ్ లు విజృంభిస్తున్నాయని వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతామన్నారు.  బనగానపల్లెకు ఔటర్ రింగ్ రోడ్డు, ఇంజనీరింగ్ కళాశాల, ఆటోనగర్ ఏర్పాటు , కోవెల కుంట్ల కు బైపాస్ రోడ్డు, కావాలని బీసీ జనార్దన్ రెడ్డి చంద్రబాబును అడగగా వీటన్నిటిని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా ప్రజలకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని, బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. 

మధ్యాహ్న సమయంలోనూ మండుటెండల్లో వేలాది మంది ఇక్కడికి తగిలి రావడం వెనుక అధికార పార్టీపై ఎంత కసి మీలో ఉందో, టిడిపి పై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో తెలిసిపోతుందని తెలిపారు. జగన్ సభలకు జనాలు లేరని, గ్రాఫిక్స్ లతో మాయ చేస్తున్నారని,ఈ మాయా లు మరో 40 రోజులు మాత్రమేనన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలని, సైకిల్ రావాలని, కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Embed widget