Chandrababu: కులాల నడుమ చిచ్చు పెట్టడం మంచిది కాదు.. రామకుప్పంలో కావాలనే ఉద్రిక్తతలు సృష్టించారు
చిత్తూరు జిల్లా రామకుప్పంలో విగ్రహాల ఏర్పాటుపై జరిగిన వివాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. కావాలనే.. ఉద్రిక్తతలు సృష్టించారని అన్నారు.
చిత్తూరు జిల్లా రామకుప్పంలో అంబేడ్కర్ విగ్రహం పక్కనే మరో విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని.. చంద్రబాబు నాయుడు అన్నారు. కులాల కుంపటికి.. ప్రభుత్వ పెద్దల వైఖరే కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహా ఏర్పాటు సందర్భంగా జరిగిన ఘటనను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం కోసం కొంతమంది కావాలనే.. ర్యాలీ చేశారన్నారు. ఇందులో భాగంగానే.. ఉద్రిక్తతలు సృష్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు పట్టించుకోవటం లేదని అడిగారు.
రామకుప్పంలో విగ్రహ ఏర్పాటుకు కావాలనే ఉద్రిక్తతలు సృష్టించారని చంద్రబాబు అన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్దే ఉయ్యాలవాడ విగ్రహం.. ఎందుకు ఏర్పాటు చేయడం.. వేరే ప్రదేశంలో ఏర్పాటు చేయోచ్చు కదా అని చంద్రబాబు చెప్పారు. ఎస్సీ సంఘాలు ధర్నా చేసేవరకు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రయత్నాలు చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు. దళిత సంఘాల ఆందోళనను ప్రభుత్వం వెంటనే.. పరిగణనలోకి తీసుకుని...ఉయ్యాలవాడ విగ్రహం మరో చోట ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో ఉద్రిక్తతలు నివారించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏమైందంటే..
డిసెంబర్ 22వ తేదీన తొలగించిన అంబేద్కర్ విగ్రహం.. వద్దే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఒక వర్గం ప్రయత్నించింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి ఎస్సీ సంఘాలు. రామకుప్పంలో సమావేశమై రెడ్డి సంఘం ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం స్థానంలోనే ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటుకు దిమ్మె నిర్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ సంఘం నేతలు, రెడ్డి సంఘం నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక వర్గానికి చెందిన జేసీబీ పై రాళ్ళ దాడి చేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
Also Read: Vijayawada: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ
Also Read: Corona Update: ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
Also Read: Somu Verraju: సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తాం