అన్వేషించండి

Tirupati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్

తిరుమల శ్రీవారిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు. అంతకుముందు వారికి అర్చకులు ఘన స్వాగతం పలికారు.

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా కేంద్ర హోమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. తిరుపతికి చేరుకున్న అమిత్ షాకు సీఎం జగన్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తాజ్ హోటల్‌లో బస చేసి ఆదివారం మధ్యాహ్నం దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా పాల్గొననున్నారు. 

అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షాకు ఏపీ సీఎం జగన్‌  శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.  ఆదివారం ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్‌ లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు అమిత్ షా. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమ నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్‌ హోటల్‌కు చేరుకుంటారు. అదే హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ భేటీ ముగిశాక ఆదివారం రాత్రి తాజ్‌ హోటల్‌లోనే బస చేస్తారు. సోమవారం ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి బయల్దేరి సాయంత్రం 5.40కు దిల్లీ వెళ్తారు.

సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుని.. మళ్లీ ఆదివారం మధ్యాహ్నం తిరుపతి బయల్దేరి వెళ్తారు. ఆదివారం జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. 

సదరన్ జోనల్ సమావేశంలో రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాలు, సరిహద్దు సమస్యలు, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పర్యాటక అభివృద్ధి, పెండింగ్ అంశాలు, ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే రాష్టాలకు సంబంధించిన 48 అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దేశాభివృద్ధిలో రాష్ట్రాల భాగస్వామ్యం మరింత పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి సూచనలు చేయనున్నారు. 

Also Read: Tirupati: రేపు తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్... ఇవాళ తిరుపతికి అమిత్ షా, జగన్... కేసీఆర్ డుమ్మా...!

Also Read: AP Financial Status : 662 శాతం లోటు ! పతనం అంచున ఏపీ ఆర్థిక వ్యవస్థ ?

Also Read: MLA Roja: చంద్రబాబు మీద లోకేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందన ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందన ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget