అన్వేషించండి

AP BJP MLA Candidates: ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!

Andhra Pradesh BJP MLA Candidates: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

AP Assembly Elections 2024: అమరావతి: త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల (BJP MLA Candidates)ను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కూటమిలో బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. గత కొన్ని రోజులుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులపై కసరత్తు చేసిన బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.

నియోజకవర్గం - అభ్యర్థుల పేర్లు
ధర్మవరం  -  సత్యకుమార్‌
ఎచ్చెర్ల  -  ఈశ్వరరావు
విశాఖ నార్త్‌ -  విష్ణుకుమార్‌ రాజు
అనపర్తి  -  శివకృష్ణంరాజు
విజయవాడ వెస్ట్‌ -  సుజనా చౌదరి
అరకు(ST)  -  పాంగి రాజారావు
బద్వేలు(SC)  -  బొజా రోషన్న
కైకలూరు  -  కామినేని శ్రీనివాస రావు
ఆదోనీ  -  పీవీ పార్థసారథి
జమ్మలమడుగు -  ఆదినారాయణరెడ్డి

ధర్మవరం టికెట్ కోసం కూటమి నేతలు ముగ్గురు పోటీ పడగా చివరికి బీజేపీ జాతీయ నేత సత్యకుమార్ వైపు మొగ్గుచూపారు. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం టికెట్ తనకే వస్తుందని భావించారు. మరోవైపు పొత్తు ఖరారు అయిన తరువాత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల రేసులోకి వచ్చారు. ఆపై బీజేపీ నుంచే సత్యకుమార్ ధర్మవరం సీటు ఆశించారు. చివరికి సత్యకుమార్ ను ధర్మవరం నుంచి బరిలోకి నిలుపుతున్నట్లు బీజేపీ తాజా జాబితాలో ప్రకటించింది.

విశాఖ నార్త్‌ నుంచి విష్ణుకుమార్‌ రాజు, విజయవాడ వెస్ట్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, కైకలూరు నుంచి రాష్ట్ర మాజీ మంత్రి  కామినేని శ్రీనివాసరావు, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి టికెట్ దక్కించుకున్నారు.


AP BJP MLA Candidates: ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!

కూటమిగా ఏర్పడి ఎన్నికలకు.. 
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వైఎస్ జగన్ ను అధికారం నుంచి దించడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు వచ్చాయి. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో చంద్రబాబుకు చెందిన టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.

ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన జగన్, చంద్రబాబు 
వైసీపీ అధినేత, సీఎం జగన్ వైనాట్ 175 అంటూ సింగిల్ గా ఎన్నికలకు వెళ్తున్నారు. తమకు ప్రజలతోనే పొత్తు అని, తమకు సామాన్యులే స్టార్ కంపెయినర్లు అని వైఎస్ జగన్, ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధమంటూ బస్ యాత్రను ప్రారంభించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. దాంతో ఏపీలో ప్రచార హోరు ఇక మొదలైందని, ఇప్పటివరకూ ఓ లెక్క.. ఇకనుంచి మరో లెక్క అనే ఎన్నికల వాతావరణం కనిపించనుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
TTD Adulterated Ghee Case: టీటీడీ నెయ్యి కల్తీ కేసు - రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
టీటీడీ నెయ్యి కల్తీ కేసు - రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget