BJP MP on Chandrababu: ఇప్పుడు చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పకపోతే నేను ఫెయిల్ అయినట్లే - సభలో బీజేపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు
Sujana Chowdary: సుజనా చౌదరి పదవీ కాలం వచ్చే జూన్ 21తో ముగియనుంది. పదవిలో ఉండగా ఆయనకి ఇవే చివరి పార్లమెంటు సమావేశాలు.
BJP MP Sujana Chowdary On Chandrababu: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి రాజ్యసభ పదవీ కాలం మరికొద్ది వారాల్లో ముగియనున్న నేపథ్యంలో ఆయన నేటి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాస్త భావోద్వేగానికి కూడా లోనయ్యారు. సీనియర్ బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనకు మెంటార్ (గురువు) లాంటి వారని, ఆయన లేకపోవటం నిజంగా తీరని లోటని అన్నారు. తనకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ Derek OBrien స్ఫూర్తి అని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏపీ పరిరక్షణ కోసమే పాటుపడుతున్నానని సుజనా చౌదరి అన్నారు. బడ్జెట్ సమావేశాలు ముగింపు రోజున ఆయన రాజ్యసభలో మాట్లాడారు.
ఈ సందర్భంగా తన జీవిత ప్రయాణం గురించి గుర్తు చేసుకున్నారు. చదువు పరంగా తాను ఒక ఇంజినీర్ అని, అభిరుచి పరంగా తాను వ్యాపారవేత్తనని, చివరికి ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రాగానే, రాజ్యసభలోకి ప్రవేశించానని ఇప్పటికి 12 ఏళ్లు గడిచిందని అన్నారు.
సుజనా చౌదరి పదవీ కాలం వచ్చే జూన్ 21తో ముగియనుంది. పదవిలో ఉండగా ఆయనకి ఇవే చివరి పార్లమెంటు సమావేశాలు. తన పదవి కాలం ముగింపు సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. తనను రెండు సార్లు రాజ్యసభకు ఎంపిక చేసిన చంద్రబాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలపకపోతే తాను ఫెయిల్ అయినట్లేనని అన్నారు. ప్రస్తుతం రాజకీయ పరంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ ఆయన్ను తాను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటానని అన్నారు.
Also Read: Nara Lokesh: లాంతరు పట్టుకొచ్చిన నారా లోకేశ్, ‘వారిద్దరూ గాడిదలు కాస్తున్నారా?’ అని ఫైర్
సీనియర్ బీజేపీ నేత అరుణ్ జైట్లీ తనకు మెంటార్ లాంటి వారని, వారు లేకపోవటం తీరని లోటు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో చాలా అనుబంధం ఉందని, తనను ఒక విద్యార్థిగా పరిగణిస్తూ ఎంతో నేర్పించారని అన్నారు. ప్రధాని మోదీని చూసి తాను చాలా నేర్చుకున్నానని సుజనా అన్నారు. తనకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఇన్స్పిరేషన్ అని అన్నారు. గులాం నబీ ఆజాద్, జయరాం రమేశ్, సీతారాం ఏచూరీ, డీ రాజా, ప్రసన్నాచార్య తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Anantapur: ఒక రైలుబోగీ పైకి ఎక్కిన మరో బోగీ, జనం ఉరుకులు పరుగులు - యాక్సిడెంట్ కాదు, ఏం జరిగిందంటే