By: ABP Desam | Updated at : 28 Nov 2022 03:46 PM (IST)
దుర్గగుడిలో అమ్మవారి ప్రసాదానికి అపచారంపై విష్ణువర్ధన్ ఆగ్రహం
BJP Vishnu : ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్తుల వల్లే వివాదాలు వస్తున్నాయని అలాంటి వారిని గుర్తించి తొలగించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శఇ విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తం చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాదరి ఆలయంలో దుర్గా మాత ప్రసాదాలపై కూర్చుని .. భక్తులకు అదే ప్రసాదం విక్రయిస్తున్న ఉద్యోగి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఉద్యోగి నిర్లక్ష్యాన్ని.. భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన వైనాన్ని ఏబీపీ దేశం ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించింది. ఈ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
చాలా ఆలయాలలో దేవాదాయశాఖ ఉద్యోగులు మతం మారడం, బ్రతకడం కోసం, దేవుడు మీద, ధర్మం మీద వారికి నమ్మకం లేకపోయినా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. హిందువులు కాణుకలు రూపంలో భక్తులు ఇచ్చేజీతం కూడా వారు తీసుకోకూడదు. దుర్గామాత గుడిలో సంఘటనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.@ABPDesam https://t.co/wGvl3EKNaL
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 28, 2022
చాలా ఆలయాలలో దేవాదాయశాఖ ఉద్యోగులు మతం మారడం, బ్రతకడం కోసం, దేవుడు మీద, ధర్మం మీద వారికి నమ్మకం లేకపోయినా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. హిందువులు కాణుకలు రూపంలో భక్తులు ఇచ్చేజీతం కూడా వారు తీసుకోకూడదన్నారు. దుర్గామాత గుడిలో సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంద్రకీలాద్రి ఆలయంలో అసలేం జరిగిందంటే ?
ప్రసాదం కోసం టిక్కెట్లు విక్రయించే కౌంటర్‌లో శానిటేషన్ ఉద్యోగి లడ్డూ ప్రసాదంపై కూర్చున్నారు. కళ్ళారా చూసిన భక్తులు ఉద్యోగిని వారించేందుకు ప్రయత్నించినప్పటికి అతను లైట్ తీసుకున్నాడు. పైగా భక్తులపైనే ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భక్తులు అడుగుతున్నా సరే.. పట్టుదలగా కూర్చొని లేవకపోవంతో భక్తులు ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
గతంలో ఓ సారి విధుల నుంచి తొలగింపు
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా.. దుర్గామాత ప్రసాదంపై కూర్చున్న ఉద్యోగి సుధాకర్‌గా గుర్తించారు. అతన్ని గతంలో కొండపై కేక్ కట్ చేసిన ఘటనలో ఈవో విధుల నుంచి పూర్తిగా తొలగించారు. అయితే తెలిసిన వారి ద్వారా మళ్లీ విధుల్లో చేరాడు. శానిటేషన్ విభాగంలో ఉండాల్సిన సుధాకర్ మూడు వందల రూపాయలు స్కానింగ్ సెంటర్‌లో తిష్ట వేశాడు. ఐదు వందలు టిక్కెట్లు ఇచ్చే కేంద్రంలో అక్కడ ఉన్న ప్రసాదాలపై కూర్చుని పెత్తనం సాగిస్తున్నాడు. తనకు సంబంధం లేకపోయినా భక్తులు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలపై కూర్చుని అపవిత్రంగా వ్యవహరిస్తున్నాడు.
కౌంటర్‌లో ఉండాల్సిన ఉద్యోగి ఏమయ్యాడు ?
కౌంటర్‌లో విధుల్లో ఉండాల్సిన యన్.ఎం.ఆర్ ఉద్యోగి లేకుండా... సుధాకర్ ఆ విభాగంలో ఏం చేస్తున్నాడని చర్చ సాగుతుంది. ఒకసారి తొలగించిన సుధాకర్‌ను మళ్లీ ఎలా విధుల్లోకి తీసుకున్నారో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈవో స్వయంగా తొలగించినా.. మళ్లీ తీసుకురావడం వెనుక ఎవరి పాత్ర ఉందనే అంశంపైనా చర్చ నడుస్తుంది. భక్తులు లడ్డూ ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని మరీ స్వీకరిస్తారు. కానీ ఇలా లడ్డూల పై కూర్చుని, అవే లడ్డూలను ప్రసాదాలుగా ఐదు వందల టిక్కెట్టు కొన్న వారికి అందించడం భక్తులు మనోభావాలను దెబ్బతీయడమేనని భక్తులు అంటున్నారు.
ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
Union Budget Live 2023 Updates: సీతమ్మ బడ్జెట్ మురిపిస్తుందా? ఉసురుమనిపిస్తుందా?
AP Capital issue : ఏపీ రాజధాని అంశాన్ని సీఎం జగన్ మళ్లీ ఎందుకు కదిలించారు ? కోర్టులో ఉన్న అంశంపై రిస్క్ తీసుకున్నారా ?
Kotamreddy vs Balineni: నా ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చూపిస్తా, కాచుకో బాలినేనీ!: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Payyavula On CM jagan : రాజధానిపై ప్రకటన కోర్టు ధిక్కారమే - సీఎం జగన్పై టీడీపీ నేత పయ్యావుల ఫైర్ !
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి