Atchannaidu: ఆడబిడ్డకు నెలకు 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి - నోరు జారిన అచ్చెన్నాయుడు - ఊరుకుంటారా?
Andhra Politics: ఆడబిడ్డకు 1500 ఇచ్చే పథకాన్ని అమలు చేయడంపై అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి ఉంటుందన్నారు.

Atchannaidu made controversial comments on scheme: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాలు అన్నీ అమలు చేశామని.. ఇంకా ఒక్కటే మిగిలి ఉందన్నారు. ఆడబిడ్డ కు నెలకు 1500 ఇచ్చే పథకం అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీ ను అమ్మాలని వ్యాఖ్యానించారు. అయినా కూడా చంద్రబాబు గారు ఈ పథకం అమలుపై ఆలోచన చేస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొని అచ్చెననాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్నీ చేశాము, ఇంకా ఒక్కటే మిగిలి ఉంది.
— H A N U (@HanuNews) July 22, 2025
ఆడబిడ్డ కు నెలకు 1500 ఇచ్చే పథకం.
ఈ పథకం అమలు చేయాలంటే ఏపీ ను అమ్మాలి. అయినా కూడా చంద్రబాబు గారు ఈ పథకం అమలుపై ఆలోచన చేస్తున్నారు - అచ్చెన్నాయుడు pic.twitter.com/IHCEkyTC7K
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో వైసీపీ నేతలు ప్రభుత్వంపై మండపడ్డారు. ఆ పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాకపోతే ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తున్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి నెలకి రూ.1,500 అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్ముకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నాడు..
— We YSRCP (@we_ysrcp) July 22, 2025
మరి ఎన్నికల్లో ఎందుకు ఈ హామీతో మహిళలను మోసం చేశారు? @ncbn
- కాసు మహేష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే.#CBNFailedCM #MosagaduBabu #AndhraPradesh #WeYSRCP pic.twitter.com/acOkqeUtkB
అయితే వైసీపీ నేతలు, సోషల్ మీడియా అచ్చెన్నాయుడు ఆ పథకం అమలు ఎంత కష్టమో అన్నది ఉదాహరణగా మాత్రమే చెప్పారని.. అంత భారం పడుతున్నా సరే చంద్రబాబునాయుడు ఆ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. అచ్చెన్నాయుడు అంటున్నారు. అయితే.. అమలు చేయడాలంటే.. రాష్ట్రాన్ని అమ్మేయాలని అన్నారు కాబట్ిట.. ఇక పథకం అమలు విషయంలో చేతులెత్తేశారని చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు. మరుమూల ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం అచ్చెన్నాయుడు శైలి అని.. దాన్ని ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే మహిళల్ని మరోసారి మోసం చేశారని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విమర్శలు గుప్పిస్తోంది.
మహిళలను మరోమారు మోసం చేసిన కూటమి సర్కార్
— YSRCP Women's Wing (@YSRCPWWOfficial) July 22, 2025
అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసిన @ncbn ప్రభుత్వం
ఆడబిడ్డనిధి పథకం అమలు చెయ్యలేము అంటున్న @katchannaidu
మహిళకు నెలకు 1500 ఇవ్వాలంటే ఆంధ్రపదేశ్ ను అమ్మాలి అంటున్న అచ్చెన్న#CBNFailedCM #CBNSadistRule… pic.twitter.com/sMfTsU71m8
యాథాలాపంగా చేసే వ్యాఖ్యలతో టీడీపీకి సమస్యలు ఏర్పడుతున్నాయి. అచ్చెన్నాయుడు గతంలో కూడా కొన్ని కామెంట్లు వైరల్ అయ్యాయి. విపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పగల వాగ్దాటి ఉండే నేతల్లో ఒకరయిన అచ్చెన్నాయుడు.. పథకం అమలు ఎంత కష్టమో చెప్పేందుకు తీసుకున్న ఉదాహరణ.. మిస్ ఫైర్ అయిన సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ వర్గాలంటున్నాయి.





















