Ashok Gajapathi Raju reactions: కంగ్రాట్స్ రాజుగారూ - అశోక్ గజపతికి ప్రశంసల వెల్లువ - అస్సలు ఊహించలేదన్న సీనియర్ నేత
Ashok: గవర్నర్ పదవి వస్తుందని అసలు ఊహించలేదని అశోక్ గజపతిరాజు అన్నారు. ఆయనకు శ్రేయోభిలాషుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Praise for Ashok Gajapathi Raju: గవర్నర్ పదవి వస్తుందని అసలు ఊహించలేదని అశోక్ గజపతిరాజు అన్నారు. గోవా గవర్నర్ గా ఆయన పేరును ప్రకటించిన తర్వాత విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. గవర్నర్ పదవి ఇస్తారని.. కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నా.. తాను ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదన్నారు. ఏవియేషన్ మిసన్టర్ గా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించానన్నారు.
పదవి ప్రకటించిన తర్వాత విజయనగరం కోటలో ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియామకంపై హర్షం వ్యక్తం చేసిన శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి.
— కాష్మోరా 2.O (@Kashmoraaaaa) July 14, 2025
ఉత్తరాంధ్ర ప్రజలకు,తెలుగువారికి దక్కిన గౌరవంగా అభివర్ణించిన ఎమ్మెల్యే లలిత కుమారి.
విలువలతో కూడిన రాజకీయాలకు, మచ్చలేని ప్రజా సేవకు మారుపేరు అశోక్ గజపతిరాజు.#AndhraPradesh pic.twitter.com/ppTkZbeKqM
అశోక్ గజపతిరాజుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు .. అశోక్ సాధించిన ఘనత గర్వకారణం అన్నారు.
Heartiest congratulations to Shri P Ashok Gajapathi Raju Garu on his appointment as the Governor of Goa. This is a moment of great pride for the people of our state. I sincerely thank the Hon’ble President of India Smt. Droupadi Murmu Ji, Hon’ble Prime Minister Shri Narendra Modi… pic.twitter.com/ChlVkexDhE
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2025
అద్వితీయమైన రాజకీయ అనుభవం, పాలనా నైపుణ్యం, రాజధర్మం పట్ల నిబద్ధతతో ఆయన ఇప్పటివరకు ఎన్నో బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించారు. దేశ రాజకీయాల్లో తెలుగుజాతికి గౌరవం తీసుకువచ్చే ఈ నియామకం ప్రతి తెలుగు వారికీ గర్వకారణమని పలువురు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి, అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా నియమితులవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, దేశ రాజకీయాల్లో తెలుగుజాతికి గౌరవకరమైన ఘట్టం.
— Lavu Sri Krishna Devarayalu (@SriKrishnaLavu) July 14, 2025
అద్వితీయమైన రాజకీయ అనుభవం, పాలనా నైపుణ్యం, రాజధర్మం పట్ల నిబద్ధతతో ఆయన ఇప్పటివరకు ఎన్నో బాధ్యతలను… pic.twitter.com/LzTUOfCEnS
2014 నుండి 2018 వరకు మేము NDA మంత్రివర్గంలో సహచరులుగా పనిచేశామని ఆయన తన పాత్రను సమర్థంగా నిర్వహిస్తారని మాజీ కేంద్ర మంత్రి సురేష్, ప్రభు తెలుగులో తన సందేశాన్ని పోస్టు చేశారు.
శ్రీ అశోక్ గజపతిరాజు గారికి గోవా గవర్నర్ గా నియమితులైన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు!
— Suresh Prabhu (@sureshpprabhu) July 14, 2025
సాదگی, నిష్ఠ, ప్రజాసేవ పట్ల అంకితభావంతో పేరు పొందిన అశోక్ గారు, తమ అనుభవంతో కూడిన శాంత స్వభావాన్ని ఈ రాజ్యాంగ బాధ్యతకు తీసుకువస్త్గారు.
2014 నుండి 2018 వరకు మేము NDA మంత్రివర్గంలో సహచరులుగా… pic.twitter.com/ywkdBex4cU
విజయనగరంని అభివృద్ధి చేసిన నాయకులు, ప్రజాసేవ పట్ల అపారమైన నిబద్ధతను చూపించిన శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్గా నియమింపబడిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) July 14, 2025
ఈ మహత్తరమైన బాధ్యతకు ఆయనను ఎంపిక చేసిన @rashtrapatibhvn గౌరవనీయ రాష్ట్రపతి… pic.twitter.com/ydBInjICJg





















