By: ABP Desam | Updated at : 09 Sep 2023 01:36 PM (IST)
నెక్ట్స్ టార్గెట్ నారా లోకేష్ - సీఐడీ చీఫ్ హింట్ ఇచ్చేశారా ?
Newt Target Lokesh : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు త్వరలో నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం ఉద్దృతంగా జరుగుతోంది. సాక్షాత్తూ సీఐడీ చీఫ్ సంజయ్ కూడా తాము లోకేష్ ను కూడా ప్రశ్నించాల్సి ఉంది. స్కిల్ స్కాములో కూడా లోకేష్ ను ప్రశ్నించాల్సి ఉందని చెప్పడం కలకలం రేపింది. అలాగే మరో రెండు రాజధాని అలైన్ మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ లోకేష్ పేరు ఉందని ఆయన చెప్పారు. సీఐడీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే లోకేష్.. ప్రస్తుతం సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పిన మూడు కేసుల విషయంలో.. ఆయా మంత్రిత్వ శాఖల్లోనూ లేరు.
రాజధాని అలైన్ మెంట్, ఫైబర్ నెట్ కేసుల్లో లోకేష్ పేరు చెప్పిన సీఐడీ చీఫ్
రాజధాని అలైన్ మెంట్ కేసులో లోకేష్ పేరు ఎప్పుడూ వినిపించలేదు. ఆయన అసలు రాజధాని వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లుగా కూడా లేదు. కానీ సీఐడీ చీఫ్ సంజయ్ ఎందుకు లోకేష్ పేరు చెప్పారో కానీ.. ఆయన కూడా తర్వాత జాబితాలో ఉన్నారన్న విషయం స్పష్టత వచ్చిందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఫైబర్ నెట్ స్కాంలో కూడా లోకేష్ పేరు ఉందని సంజయ్ చెప్పారు. నిజానికి ఈ రెండు కేసులకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు లోకేష్ కు సంబంధం లేదు. లోకేష్ పంచాయతీరాజ్ , ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఫైబర్ నెట్ ఐటీ శాఖ కిందకు రాలేదు. పరిశ్రమల శాఖ కిందకు వస్తుంది. అయినా ఈ విషయాల్లో లోకేష్ పై ఇంత వరకూ కేసులు నమోదు కాలేదు. అయినా సీఐడీ చీఫ్ లోకేష్ పేరు చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.
అదే తరహా హెచ్చరికలు చేసిన మంత్రులు
సీఐడీ చీఫ్ సంజయ్ లోకేష్ నూ ప్రశ్నిస్తామని.. రెండు స్కాముల్లో ఆయన పేరు ఉందని చెప్పిన తర్వాత మీడియాతో మాట్లాడిన పలువురు మంత్రులు కూడా.. ఇలాగే హెచ్చరిక ప్రకటనలు చేశారు. లోకేష్ సంగతి కూడా చూస్తామన్నట్లుగా మంత్రులు ప్రకటనలు చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఓ అడుగు ముందుకేసి.. బ్రోని కూడా మూసేస్ామని హెచ్చరించారు. అంటే పవన్ కల్యాణ్ నూ అరెస్ట్ చేస్తామని ఆయన బెదిరించినట్లయింది.
కుట్రపూరితంగా సీఐడీ చీఫ్ వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆగ్రహం
సీఐడీ చీఫ్ సంజయ్ లోకేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తన్నారు. ఏపీ ఫైబర్ నెట్‌తో.. రాజధాని అలైన్ మెంట్ తో లోకేష్ కు సంబంధం ఏమిటని అంటున్నారు. సీఐడీ అధికారులు రాజకీయ కుట్రలకు కేంద్రంగా మారారని.. మార్గదర్శి కేసులోనూ అదే చేశారని ఇప్పుడు ప్రతిపక్ష నేతలపైనా తప్పుడు కేసులతో విరుచుకుపడుతున్నారని అంటున్నారు. చట్టాలను ఉల్లంఘించి ఇలా మానవహక్కులను కాలరాయడం.. అధఇకారులే బెదిరింపులకు పాల్పడటం ఏమిటని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
Vote for Note Case: తెరపైకి ఓటుకు నోటు కేసు - 4న సుప్రీంకోర్టులో విచారణ
Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
Nara Lokesh: నారా లోకేష్ కీలక నిర్ణయం, రేపు ఢిల్లీలో ఒక రోజు నిరాహారదీక్ష
బీఆర్ఎస్కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్షా - నెట్టింట్లో వీడియో వైరల్
/body>