News
News
X

Trains Cancel: ఈ 10వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు, కొన్ని దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే

ఈ రోజు నుండి రద్దయిన పలు రైళ్ళు,మరి కొన్ని దారిమళ్లింపు...ఇలా...

FOLLOW US: 
Share:

నేటి నుండి ఈ నెల 10వ తేదీ వరకు విజయవాడ , గుంటూరు డివిజన్ పరిధిలో పలు రైళ్ళ రాకపోకలను రద్దు చేయటంతో పాటుగా మరికొన్నిటిని దారి మళ్ళిస్తున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది. నిర్వాహణ పరమైన సమస్యల కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

రద్దు... దారి మళ్ళించిన రైళ్ల వివరాలు ఇవే...
రైల్వేలో నిర్వాహణ పనుల కారణంగా విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్ళ రాకపోకలను రద్దు చేసి మరి కొన్నింటిని దారి మళ్ళించారు. విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లాల్సిన 07978 నెంబరు గల ట్రైన్ ను 7వ తేదీన రద్దు చేశారు. విజయవాడ నుండి గూడూరు వెళ్ళాల్సిన 07500 నెంబరు గల రైలు 7వ తేదీన రద్దు చేశారు. ఇక గూడరు నుంచి విజయవాడ కు 8వ తేదీన రావాల్సిన 07458 నెంబర్ గల రైలు రద్దు చేశారు. కాకినాడ పోర్ట్ నుండి విశాఖపట్టణం కు వెళ్ళాల్సిన 17267నెంబర్ గల రైలును 7వ తేదీన రద్దు చేశారు. విజయవాడ నుండి ఓంగోలు వెళ్లాల్సిన 07461 నెంబరు గల రైలు ను 7న రద్దు చేశారు.

ఒంగోలు నుంచి విజయవాడ రావాల్సిన 07576 నెంబరు గల రైలును 7వ తేదీన పూర్తిగా రద్దు చేశారు. ఇక తాత్కాలికంగా రద్దయిన రైళ్ళ విషయానికి వస్తే కాకినాడ పోర్ట్ నుండి విజయవాడకు వెళ్ళాల్సిన మెమూ రైలును 7వ తేదీ కాకినాడ పోర్ట్, రాజమండి మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. విజయవాడ నుంచి కాకినాడ పోర్ట్ కు వెళ్లాల్సిన మెమూ రైలును, రాజమండి కాకినాడ పోర్ట్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.

గుంటూరు డివిజన్ పరిధిలో.... 
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో న్యూ గుంటూరు.... నంబూరు స్టేషన్ల మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా గుంటూరు, KRISHNA కెనాల్ మధ్య మరమ్మతులు కారణంగా విజయవాడ, గుంటూరు లోకల్ ట్రైన్ ను ఈనెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేశారు. వాటితో పాటు హుబ్లి... విజయవాడ మార్గంలో నడిచే 17329 నెంబరు గల ట్రైన్ ను ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు గుంటూరు, విజయవాడ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. విజయవాడ... హుబ్లి మధ్య నడిచే 17330 నెంబరు గల రైలును 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విజయవాడ గుంటూరు మధ్య రద్దు చేశారు. 12706 నెంబరు గల సికింద్రాబాద్ ... గుంటూరు రైలును గుంటూరు, సికింద్రాబాద్ మార్గంలో నడిచే 12705 నెంబరు గల రైలును 9వ తేదీ నుంచి 10 వతేదీ వరకు విజయవాడ... గుంటూరు, గుంటూరు .. విజయవాడ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. గుంటూరు విజయవాడ మధ్య నడిచే 07979 నెంబరు గల రైలును 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు తెనాలి, KRISHNA  కెనాల్ మద్య డైవర్షన్ చేశారు. చెన్నై విజయవాడ మధ్య నడిచే 12077 నెంబరు గల రైలును 9,10 తేదీల్లో తెనాలి, KRISHNA కెనాల్ మధ్య డైవర్ట్ చేశారు.

తిరుపతి స్టేషన్ లో పనులు వేగవంతం... 
రాబోయే 40 ఏళ్ల ను దృష్టిలో ఉంచుకొని  రైలు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దెందుకు  దక్షిణ మధ్య రైల్వే , తిరుపతి స్టేషన్ అభివృద్ది  పనులను చేపట్టింది. మే 2022లో ప్రారంభించిన ఈ పునరాభివృద్ది పనులు ముమ్మరంగా  సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్  పనులు సకాలంలో పూర్తయ్యేలా అన్ని స్థాయిలలో పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులను చేపట్టేందుకు  ఈ పి సి  విధానంలో కాంట్రాక్టు అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మొత్తం పనులు  ఫిబ్రవరి 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న తిరుపతి  స్టేషన్ భవనానికి దక్షిణం వైపున కొత్త స్టేషన్ భవనం రాబోతోంది. జియోలాజికల్ సర్వే పూర్తయిన తర్వాత, క్యాంపు కార్యాలయం, కాంక్రీట్ ల్యాబ్ & స్టోరేజీ షెడ్ల ఏర్పాటు కు సంబందించిన పనులతో పాటు  మిగిలిన పనులు  వేగంగా కొనసాగుతున్నాయి. కొత్త స్టేషన్‌ భవనానికి  పునాదులు  కాంక్రీటింగ్  పనులు  పూర్తయ్యాయి . ఇప్పటి వరకు, ఫౌండేషన్‌లు, బేస్‌మెంట్ ఫ్లోర్ యొక్క స్తంభాలు, రిటైనింగ్ వాల్‌లో సుమారు 7,450 క్యూబిక్ మీటర్ల కాంక్రీటును ఉపయోగించారు. తదుపరి దశలో, బేస్‌మెంట్ ఫ్లోర్ కోసం కాంక్రీట్ స్లాబ్‌ను సెంట్రింగ్ మరియు షట్టరింగ్‌కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించిన పనులు ఇప్పటివరకు దాదాపు 20%  మేర పనులు పూర్తయ్యాయి.

కొత్త స్టేషన్ భవనంలో  29 లీటర్ల నీటిని నిల్వచేసే సామర్థ్యంతో అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్  ఏర్పాటు  కానుంది .  దీని కోసం, భూగర్భ ట్యాంకు నిర్మాణ కోసం  తవ్వకం పనులు మరియు  పునాదులకు కాంక్రీటింగ్ పనులు    కూడా పూర్తయ్యాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌ ను  పునరాభివృద్దిలో  భాగంగా  స్టేషన్ కు  రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం  రెండు కొత్త ఎయిర్ కాన్‌కోర్సులను నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ ఎయిర్‌కోర్స్‌లు 35 మీటర్ల వెడల్పుతో ఉంటాయి.  స్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లను మరియు స్టేషన్ భవనాలకు రెండు వైపులా (ఉత్తరం మరియు దక్షిణం) కలుపుతాయి. ప్లాట్ ఫారం నెం 4 & 5లో ఎయిర్‌కోర్సుల  పునాదుల కోసం తవ్వకం పనులు ప్రారంభించారు. తిరుపతి స్టేషన్ పునరాభివృద్ది  పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, తద్వారా పనులకు ఆటంకం కలగకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. స్టేషన్‌లో ప్రయాణికులకు, రైళ్ల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత జాగ్రత్తగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

Published at : 07 Feb 2023 07:09 PM (IST) Tags: AP News South Central Railway Tirupati ap updates AP TRAINS CANCEL

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం

Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

TDP 41 Years : 41 ఏళ్లలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు - టీడీపీ పూర్వ వైభవం సాధిస్తుందా ?

TDP 41 Years :   41 ఏళ్లలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు - టీడీపీ పూర్వ వైభవం సాధిస్తుందా ?

Weather Latest Update: ఇక తెలుగు రాష్ట్రాల్లో పేట్రేగిపోనున్న ఎండలు! అంతటా పొడిగానే వాతావరణం

Weather Latest Update: ఇక తెలుగు రాష్ట్రాల్లో పేట్రేగిపోనున్న ఎండలు! అంతటా పొడిగానే వాతావరణం

AP Early Elections : సీఎం జగన్ ముందస్తు సన్నాహాల్లో ఉన్నారా ? పదే పదే ఢిల్లీ పర్యటనలు అందుకోసమేనా ?

AP Early Elections :  సీఎం  జగన్ ముందస్తు సన్నాహాల్లో ఉన్నారా ? పదే పదే ఢిల్లీ పర్యటనలు అందుకోసమేనా ?

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!