అన్వేషించండి

Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ - సీతారామరాజు వారసులకు సత్కారం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ - సీతారామరాజు వారసులకు సత్కారం

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అదే సమయంలో నైరుతి బంగాళాఖాతం నుంచి సైతం 50 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు (జూలై 4) ఉత్తర ఒడిశా దాని పరసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఏపీలోని కోస్తాంధ్రలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుల హెచ్చరిక, వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ ఇప్పుడు పశ్చిమ పసిఫిక్ కి వెళుతోంది. దాంతో జూలై రెండు, మూడు వారాల్లో రెండు నుంచి మూడు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. అందులో ఏదైన ఒక్కటి ఉత్తరాంధ్ర తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాస - టెక్కళి, అనకాపల్లి, విశాఖ​, పార్వతీపురం జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా జిల్లా గుడివాడ - కైకలూరు మీదుగా కొనసాగుతున్న వర్షాలు నేరుగా పశ్చిమ గోదావరి, నర్సాపురం నుంచి కృష్ణా జిల్లా బందరు, పెడన దాక విస్తరించనున్నాయి. కృష్ణా, విజయవాడ​, గుంటూరు, బాపట్ల, ఉత్తర ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. అయితే జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షం కురుస్తుండగా, మిగతా ప్రాంతాల్లో చినుకులు కూడా పడవు.

హెచ్చరిక: కొన్ని వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేడు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మణికొండ​, లింగంపల్లి, జూబ్లీ హిల్స్ తో పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 

12:26 PM (IST)  •  04 Jul 2022

Modi Speech in Bhimavaram: ఇక్కడికి రావడం నా అదృష్టం, ఈ మట్టికి నా నమస్కారాలు - మోదీ

అల్లూరి విగ్రహావిష్కరణ వేదికపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలుగువీర లేవరా అన్న శ్రీశ్రీ పాటను గుర్తు చేశారు. అల్లూరి స్వాతంత్య్ర  సంగ్రామంతో యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సీతారామరాజు పుట్టిన ఈ నేలపై కలుసుకోవటం ఎంతో అదృష్టమని అన్నారు. స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రదేశ ప్రజలు చేసిన ఆత్మబలిదానాలు, ఆదివాసీ ప్రజలు చూపిన తెగువ ఎంతో ప్రేరణనిచ్చిందని అన్నారు. ఇంత గొప్పచోటుకు రావటం తన అదృష్టమని మోదీ చెప్పారు. ఈ మట్టికి నమస్కరిస్తున్నానని అన్నారు.

12:00 PM (IST)  •  04 Jul 2022

రంగా కొడుకుగా పుట్టడం తన అదృష్టం.. రంగా 75వ జయంతి వేడుకల్లో వంగవీటి రాధా

విజయవాడలో ఘనంగా వంగవీటి మోహనరంగా 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. రంగా కొడుకుగా పుట్టడం తన అదృష్టం అని, రంగా ఒక వ్యక్తి కాదు... ఒక శక్తి అన్నారు వంగవీటి రాధా.  విజయవాడలో రంగా తనయుడు వంగవీటి రాధా వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదల పెన్నిది వంగవీటి రంగా అని, ఆయన విజయవాడకు మాత్రమే చెందిన వ్యక్తి కాదు అని.. ఆయన అభిమానులు అన్నిపార్టీల్లో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. తన తండ్రి రంగా ఆశయాలను కొనసాగిస్తానన్నారు. బడుగు, బలహీన వర్గాలకు వెన్నంటి ఉండి, వారి సమస్యలపై పోరాడిన వ్యక్తి రంగా అని వంగవీటి రాధా పేర్కొన్నారు.

11:49 AM (IST)  •  04 Jul 2022

Alluri Sitaramaraju Statue Unveiling: అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అల్లూరి వారసులను ఘనంగా సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సోదరుడి కుమారుడైన 80 ఏళ్ల శ్రీరామరాజు అనే వ్యక్తికి పాదభివందనం కూడా మోదీ చేశారు.

11:47 AM (IST)  •  04 Jul 2022

Alluri Sitaramaraju Statue Unveiling: అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అల్లూరి వారసులను ఘనంగా సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సోదరుడి కుమారుడైన 80 ఏళ్ల శ్రీరామరాజు అనే వ్యక్తికి పాదభివందనం కూడా మోదీ చేశారు.

11:44 AM (IST)  •  04 Jul 2022

CM Jagan Speech: అందుకే అల్లూరి జిల్లా ఏర్పాటు చేసుకున్నాం - సీఎం జగన్

స్వాతంత్ర్యం కోసం, దేశం, అడవి బిడ్డల కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు చిరకాలం నిలిచిపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ‘‘ఆయన నడిచిన నేల అయినందున మన్యం ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లా అని కూడా పేరు పెట్టుకున్నాం. 125వ జయంతి సందర్భంగా అల్లూరి జిల్లాలో కూడా ఓ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది.’’ అని సీఎం జగన్ అన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Embed widget