News
News
X

Breaking News Live Telugu Updates: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన 

వరసగా మూడో ఏడాది జగనన్న అమ్మ ఒడి పథకాన్ని శ్రీకాకుళంలో బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. సోమవారం ఉదయం 08.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు అక్కడి నుంచి తిరుగుపయనమై, 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Prattipati Pullarao: 160 సీట్లు గెలిచే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది: ప్రత్తిపాటి
 • పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన మాజీ మంత్రి, రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు
 • సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతగాని పనులు, చెత్త పరిపాలనకు ప్రజలు రోడ్డెక్కి పరిస్థితి వచ్చింది: ప్రత్తిపాటి
 •  రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు ఎదురు చూస్తున్నారు: ప్రత్తిపాటి
 • ఏ పార్టీ పొత్తు లేకపోయినా 160 సీట్లు గెలిచే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది: ప్రత్తిపాటి
 • అమరావతి రాజధాని అభివృద్ధి చేయకుండా అమ్ముకునే అధికారం సీఎం జగన్మోహన్ రెడ్డికి కి ఎవరు ఇచ్చారు: ప్రత్తిపాటి
 • ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎకరా రూ 10 కోట్ల కి అమ్మాలంటే నీ దుర్మార్గానికి ఎవరు ముందుకు వస్తారు: ప్రత్తిపాటి
 • మూడు సంవత్సరాల వైకాపా పాలన విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేత లకే సరిపోయింది: ప్రత్తిపాటి
AP Elections 2024: పొత్తు లేకపోయినా 160 సీట్లు గెలిచే సత్తా టీడీపీకి ఉంది: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన మాజీ మంత్రి, రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు

సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతగాని పనులు, చెత్త పరిపాలనకు ప్రజలు రోడ్డెక్కి పరిస్థితి వచ్చింది: ప్రత్తిపాటి

 రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు ఎదురు చూస్తున్నారు: ప్రత్తిపాటి

ఏ పార్టీ పొత్తు లేకపోయినా 160 సీట్లు గెలిచే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది: ప్రత్తిపాటి

అమరావతి రాజధాని అభివృద్ధి చేయకుండా అమ్ముకునే అధికారం సీఎం జగన్మోహన్ రెడ్డికి కి ఎవరు ఇచ్చారు: ప్రత్తిపాటి

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎకరా రూ 10 కోట్ల కి అమ్మాలంటే నీ దుర్మార్గానికి ఎవరు ముందుకు వస్తారు: ప్రత్తిపాటి

మూడు సంవత్సరాల వైకాపా పాలన విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేత లకే సరిపోయింది: ప్రత్తిపాటి

విషపూరిత హానికరమైన మూడు రకాల మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయిస్తూ పేదవాడి ప్రాణాలను ఎలా బలిగొంటారు: పత్తిపాటి

ధన దాహన్ని ఆపి నాసిరకం మద్యంతో ఖజానా నింపుకోవాలని దురాలోచన ఇప్పటికైనా ఆపాలి: ప్రత్తిపాటి

ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణలో ఎంత అవినీతి జరిగిందో ప్రజలందరికీ తెలుసు: ప్రత్తిపాటి

తెదేపా ప్రభుత్వంలో కట్టించిన టిడ్కో ఇల్లు పేద ప్రజలకు ఇవ్వకపోగా ప్రస్తుతం నివేసన స్థలాల్లో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు: ప్రత్తిపాటి

వెన్నెముక లేని సీఎంగా జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో, ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు: ప్రత్తిపాటి

ఢిల్లీలో మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం మోకరిల్లడం సిగ్గుచేటు: ప్రత్తిపాటి

రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిన జగన్మోహన్రెడ్డికి చంద్రబాబును విమర్శించే అర్హత కోల్పోయాడు: ప్రత్తిపాటి

అధికార పార్టీ ప్లీనరీలకు వైకాపా వారే రావడానికి ముఖం చాటేస్తున్నారు: ప్రత్తిపాటి

చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు: ప్రత్తిపాటి పుల్లారావు

Maharashtra Crisis: రెబల్ నేతలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

ఏక్‌నాథ్‌ షిండేతో సహా రెబల్ ఎమ్మెల్యేలంతా పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలంటూ సవాల్ విసిరారు ఉద్దవ్ థాక్రే 
కుమారుడు ఆదిత్య థాక్రే. వారం రోజులుగా ఎమ్మెల్యేలు షిండే శిబిరంలోనే ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

Atmakur Bypoll Result: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గెలుపు

ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 82,888 ఓట్ల ఆధిక్యంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి గెలిచారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్లు పూర్తయ్యేసరికి 82,888 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలిచారు.

Atmakur By Election Result: ప్రతి రౌండ్‌కు పెరుగుతున్న వైసీపీ అభ్యర్థి మెజారిటీ, 13 రౌండ్లకి 66 వేల మెజారిటీ

ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నిక లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్‌ నుంచి అధికార వైసీపీ స్పష్టమైన భారీ మెజారిటీతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 13 రౌండ్లుపూర్తయ్యాయి. 13 రౌండ్లు పూర్తయ్యేసరికి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 66,650 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌ రెడ్డి 50,654 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రతి రౌండ్‌కు ఆధిక్యం భారీగా పెరుగుతుండడంతో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు ఏకపక్షం అయింది.

Kollapur Politics: కొల్లాపూర్‌లో మరింత ముదిరిన ఉద్రిక్తత, పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే హర్షవర్థన్

కొల్లాపూర్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి హౌస్ అరెస్టులో ఉన్న ఇద్దరు టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే హర్షవర్థన్, మాజీ మంత్రి జూపల్లి ఇంటి నుంచి బయటకు వచ్చారు. తమ అనుచరులతో హర్షవర్థన్ భారీ ర్యాలీ తరహాలో బయటికి రాగా, పోలీసులు హర్షవర్థన్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన అనుచరులు పోలీసుల వాహనాలను కదలకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను వదిలిపెట్టాలని వారు డిమాండ్ చేశారు.

Kakinada JNTUK: కాకినాడలో ర్యాగింగ్ కలకలం, 11 మంది సస్పెండ్

కాకినాడ JNTU ఇంజినీరింగ్ కాలేజీలో  ర్యాగింగ్ జరిగింది. దీంతో 11 మంది విద్యార్థులు సస్పెండ్ అయ్యారు. ర్యాగింగ్‌కు పాల్పడ్డారని తేలిన 11 మంది విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇద్దరు ద్వితీయ సంవత్సరం, తొమ్మిది మంది మూడో సంవత్సరం పెట్రోకెమికల్ సీనియర్ విద్యార్థులు హాస్టల్‌లో మొదటి సంవత్సరం పెట్రోకెమికల్ విద్యార్థిని ర్యాగింగ్ చేశారు. దీంతో వారు యూసీజీ యాంటీ ర్యాగింగ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేశారు.  విచారణ తర్వాత మొత్తం 11 మందిని హాస్టల్ నుండి రెండు నెలల పాటు, తరగతుల నుండి 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు.

Telangana Coronavirus: తెలంగాణలో 496 కొత్త కరోనా కేసులు
 • తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
 • మళ్లీ పుంజుకుంటున్న కరోనా
 • పెరుగుతున్న రోజువారీ కేసులు
 • గత 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు
 • 496 మందికి పాజిటివ్
 • హైదరాబాదులో 341 కొత్త కేసులు
Atmakuru Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్‌, ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎ‍స్సార్‌ సీపీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి 12,864 ఓట్ల మెజారిటీ సాధించి భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. రెండో రౌండ్‌ పూర్తయ్యేసరికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 10 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. మూడో రౌండ్‌లోనూ ఆధిక్యంలో కొనసాగారు.. విక్రమ్‌రెడ్డి. తొలి రౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ లభించింది. విక్రమ్‌రెడ్డికి 6 వేలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌కు 700 పైచిలుకు ఓట్లు వచ్చాయి. అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బరిలో లేకపోవడంతో మేకపాటి గెలుపు మరింత సులువు అవుతోంది.

Background

నైరుతి రుతుపవనాల ప్రభావంతో శనివారం నాడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. 18 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంట ఉన్న అల్పపీడన ద్రోణి సముద్ర మట్టంపై 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల మధ్య ఉన్నదని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ ఇటీవల హెచ్చరించింది. తెలంగాణలోనూ కొన్ని చోట్ల పిడుగులు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నీటి గుంతలు, విద్యుత్ తీగలు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉంటూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉత్తర కోస్తాంధ్రయ యానాంలలో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. అదే జిల్లాల్లో మిగతా ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు అధికంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు, ఎల్లుండి సైతం తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.

దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి వర్ష సూచన సాధారణంగా ఉంది. ఉత్తర కోస్తాంధ్ర తరహాలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవు. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో నేటికి వర్షాలు మొదలుకాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు ఎప్పుడు మొదలుపెట్టాలే అర్థం కాని పరిస్థితి ఆ జిల్లాల రైతుల్లో నెలకొంది.  

హెచ్చరిక: వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అన్నదాతలను హెచ్చరించింది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో జూన్ 28 వరకు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయని పేర్కొంది. 

హైదరాబాద్‌లో నేడు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో శనివారం వర్షాలు కురిశాయి.  గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు మరియు 23.6 డిగ్రీలుగా నమోదయ్యాయి. పశ్చిమ దిశ నుంగి గంటకు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.