Breaking News Live Telugu Updates:పలాస టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై హత్యాయత్నం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
పలాస టీడీపీ అధ్యక్షుడు లక్ష్మణరావుపై హత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై దుండగులు హత్యాయత్నం చేశారు. లక్ష్మణరావు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. స్థానికులు చేరు కోవడంతో దుండగులు పరారయ్యారు. సోంపేట వైపు బస్సులో దుండగులు పరారయ్యారు. గాయపడిన లక్ష్మణరావును గౌతు శిరీష ఆసుపత్రికి తరలించారు.
Eluru District: కుటుంబంపై కత్తులతో దాడి, ముగ్గురూ హత్య
- ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగుడెంలో దారుణ ఘటన
- గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి
- భార్యభర్తలతో పాటు చిన్నారిని కూడా కత్తితో నరికిన ఆగంతకులు
- తీవ్ర గాయాలతో ప్రాణాపాయ పరిస్థితిలో కుటుంబం
- జంగారెడ్డి గూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
- ఘటనపై మైసన్నగూడెంలో విచారణ చేపట్టిన పోలీసులు
Tirumala News: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Tirupati District News: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
తిరుపతి జిల్లా, కెవిబి.పురం మండలం, జ్ఞానమ్మకండ్రిగలో మునయ్య అనే రైతు అప్పుల బాధ తాళలేక తన పొలంలో ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ రైతు మునయ్య మృతి చెందారు. తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరి కొంత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే మునయ్య, వేసిన పంట నష్టం రావడంతో అప్పులు ఎలా తీర్చాలని బెంగతో ఆత్మహత్యకు పాల్పడాడు సమాచారం అందుకున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మునయ్య నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా వారి కుటుంబాని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
AP Capital News: శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చేరిన అమరావతి రథం
ఒకే రాష్ట్రం రాజధాని అని గళమెత్తుతూ అమరావతి రథం శనివారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చేరుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 'రైతులు చేపట్టిన 'మహా పాదయాత్ర 2.0' గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిపివేశారు. ఆగిన రథాన్ని అరసవల్లి తీసుకువెళ్లి యాత్రకు ముగింపు పలకాలని రైతులు నిర్ణయించారు. ఆ మేరకు శుక్రవారం రామచంద్రపురంలో బయలుదేరిన రథం అరసవల్లి చేరుకుంది. అమరావతి నుంచి రైతులు కూడా వచ్చి నేడు అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం జిల్లాకు చేరుకున్నవారికి ఓ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేశారు. ఆదివారం రథాన్ని ఆదిత్యాలయ సమీపంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

