Breaking News Live: ఏపీ - తమిళనాడు సరిహద్దులో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మహిళలు దుర్మరణం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
మన దేశంలో ఇంధన ధరలు క్రమంగా ఎగబాకుతూ వస్తున్నాయి. నాలుగు నెలల క్రితం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరిన సంగతి తెలిసిందే. కానీ, కొద్ది నెలల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. అయితే, మళ్లీ ముడి చమురు ధరలు ప్రస్తుతం 110 డాలర్ల మార్కును దాటాయి. తాజాగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ ధరలు మరింత ఎగబాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేశంలో మళ్లీ ధరలు పెరుగుతాయోననే ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price : హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా నేడు కూడా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.80 పైసలు పెరిగి రూ.114.52గా ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.0.87 పైసలు పెరిగి రూ.100.71 గా ఉంది. ఇక వరంగల్లోనూ (Warangal Petrol Price) నేడు ధరలు కాస్త పెరిగాయి. నేడు (మార్చి 31) పెట్రోల్ ధర రూ.0.80 పైసలు పెరిగి రూ.114.02 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.87 పైసలు పెరిగి రూ.100.23 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధరలు నేడు భారీగా పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.1.41 పైసలు పెరిగి నేడు రూ.116.70 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.1.35 పైసలు పెరిగి రూ.102.74 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్లో పెట్రోల్ ధర నేడు రూ.0.87 పైసలు పెరిగి రూ.116.39గా ఉంది. డీజిల్ ధర రూ.0.84 పైసలు పెరిగి రూ.102.20 గా ఉంది. ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్లో కూడా పెట్రోల్ ధర నేడు ఎగబాకింది. నేడు లీటరు ధర రూ.1.12 పైసలు పెరిగి రూ.115.42 గా ఉంది. డీజిల్ ధర (Diesel Price in Visakhapatnam) కూడా నేడు రూ.1.07 పైసలు పెరిగి రూ.101.27గా అయింది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తిరుపతిలో (Tirupati Petrol Price) ఇంధన ధరలు నేడు పెరిగాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.0.88 పైసలు పెరిగి రూ.116.67 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర (Diesel Price in Tirupati) రూ.0.84 పైసలు పెరిగి నేడు రూ.102.42కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత 70 నుంచి 80 డాలర్ల మధ్య హెచ్చుతగ్గులు ఉండేది. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో మార్చి 30 నాటి ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 104.93 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరింది. దీంతో మన దేశంలో పెట్రోల్ రూ.140 దాటుతుందనే విశ్లేషణలు వస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొని ఉంది.
Kurnool: కర్నూలు జిల్లాలో చిరుత పులి మృతి
* బండి ఆత్మకూరు మండలం నల్లమల అడవిలో చిరుతపులి మృతి
* పెద్దపులి, చిరుత పులి ఘర్షణలో చిరుత మరణించిందంటున్న అటవీ అధికారులు
* మృతి చెందిన చిరుతపులిని పోస్టు మార్టం నిర్వహించి దహనం చేసిన ఫారెస్ట్ అధికారులు
* నల్లమలలో వరుసగా పులుల మరణంతో అందోళన చెందుతున్న అధికారులు
ఏపీ - తమిళనాడు సరిహద్దులో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మహిళలు దుర్మరణం
* కుప్పం సరిహద్దు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం
* లారీని ఢీకొన్న మినీ బస్సు
* ముగ్గురు మహిళలతో పాటు బస్సు డ్రైవర్ దుర్మరణం
* 15 మందికి గాయాలు చికిత్స నిమిత్తం ఆంబూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
* గాయపడిన వారిలో మరో ముగ్గురు పరిస్థితి విషమం..
* తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలో రోడ్డు ప్రమాదం
TTD ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: ఛైర్మన్ సుబ్బారెడ్డి
టీటీడీ ఉద్యోగస్తులకు మెరుగైన వసతులు, ఆరోగ్య భధ్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతి అతిధి గృహంలో సుమారు 62 కోట్ల రూపాయల డీడీని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయనణ్ కు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. 25 ఏళ్ళ టీటీడీ ఉద్యోగుల కళ నెరవేర్చిన ఏకైక సీఎం జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసి ఉద్యోగస్తులకు ఇంటి స్ధలాలు ఇస్తామని తెలిపారు. అందుకు గాను మూడు వందల ఎకరాలు భూమి అవసరం ఉందని, తిరుపతి నగరంకు దగ్గరలో స్ధలం కేటాయించినట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా సుమారు 5,518 మందికి టీటీడీ ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు పంపిణి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం టీటీడీలో కొనసాగుతున్న దర్శనాల విధి విధానాలు అలానే కొనసాగుతుందని చెప్పారు. స్లాట్ టిక్కెట్లు పొందిన భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రోజుకు డెభై నుండి ఎనభై వేలమంది భక్తులు స్వామి దర్శనం పొందుతున్నారన్నారు. టీటీడీ పాలక మండలిలో నేర చరితులపై టీటీడీ ఛైర్మన్ స్పందిస్తూ. హైకోర్టు తుది తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. హైకోర్టు తీర్పు వచ్చాక టీటీడీ బోర్డులో మార్పులు చేర్పులపై చర్చించి నిర్ణయం తీసుకుంటాని ఆయన వెల్లడించారు.
Jogulamba Gadwala: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు
గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఇర్కిచేడు గ్రామంలో ఓ స్థలం ఇరువర్గాల మద్య ఘర్షణకు దారితీసింది. గురువారం గ్రామంలోనీ ఓ స్థలంలో నూతనంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. గ్రామంలోని ఓ వర్గం అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరిస్తున్న సమయంలో మరొ వర్గం ప్రజలు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కేటిదొడ్డి ఎస్ఐ కుర్మయ్య పరిస్తితిని అదుపులోకి తీసుకవచ్చారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుండా ముందస్తుగా గ్రామంలో పోలీసుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల మద్య తోపులాటలొ ప్రమాదవశాత్తు పెట్రోల్ పడటంతొ పొరబాటున నిప్పంటుకుంది. గమనించిన ఎస్ఐ కుర్మయ్య , పోలీసులు మంటలను ఆర్పారు. అనంతరం ఇరువర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న గద్వాల డీఎస్పీ ఎన్ సిహెచ్ రంగస్వామి, సిఐ ఎస్ఏం బాష, ఆద్వర్యంలో పోలీసుల బందోబస్తు నిర్వహిస్తునారు. గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహాని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గ్రామంలో ప్రశాంత వాతావరణం :డీఎస్పీ రంగస్వామి
గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పెందుకు పోలీసులకు గ్రామస్తులు సహకరించాలని గద్వాల డీఎస్పీ రంగస్వామి కోరారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. అలాగే ఎస్ఐ కుర్మయ్యకు నిప్పంటుకుందని సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయని... కాని అలాంటి ఏమి జరగలేదని ఆయన ఖండించారు. గ్రామంలోని ప్రజలందరూ విగ్రహాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో తీర్మానం చేసుకున్న తర్వాతే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులను కోరారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో చెప్పులతో కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ పురపాలక కౌన్సిల్ సమావేశంలో వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా, అదే పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ల ఇర్ఫాన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మునిసిపల్ సమావేశంలో కౌన్సిలర్లు చెప్పులతో కొట్టుకున్నారు.