News
News
వీడియోలు ఆటలు
X

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హతలు లేకుండా లా కోర్సులో చేరడంపై తెలంగాణ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. విద్యార్హత లేకపోయినా ఎలా చేరారని ప్రశ్నించారు.

FOLLOW US: 
Share:

TDP On Tammneni :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ చదవుకుండానే మూడేళ్ల లా కోర్సులో జాయినల్యాయరని ..  డిగ్రీ డిస్ కంటిన్యూడ్ తమ్మినేని  3ఏళ్ల ఎల్ఎల్బీ కోర్స్లో ఎలా అడ్మిషన్ పొందారని తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన  తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి  రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న తమరికి చదవుల్లో మినహాయింపులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు.   తమ్మినేని సీతారాం   2019 లో స్వీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత  ఉన్నత చదువు కోసం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీ లో ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవటానికి అడ్మిషన్ పొందారు.                    
 
అకడమిక్ ఇయర్ 2019-20లో ఆయన  హాల్ టికెట్ నెంబర్ 1724 1983 1298 అని నర్సిరెడ్డి చెబుతున్నారు.  ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్స్ చదవాలంటే కచ్చితంగా డిగ్రీ పాసై ఉండాలి. లేదా డిగ్రీకి సమానమైన అర్హత కలిగిన కోర్స్ పూర్తి చేసినవారు మాత్రమే ఎల్ఎల్బి 3 సంవత్సరాల కోర్స్ పూర్తి చేయడానికి అర్హులన్నారు. కానీ  డిగ్రీ మధ్యలోనే ఆపే్సిన  తమ్మినేని సీతారాం మూడేళ్ల కోర్సులో ఎలా అడ్మిన్ పొందారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా నర్సిరెడ్డి చెప్పుకొచ్చారు.  అనేక టీవీ ఇంటర్వ్యూలలోనే 'డిగ్రీ డిస్ కంటిన్యూడ్' చేసినట్లు తమ్మినేని స్వయంగా చెప్పారని   తన ఎన్నికల అఫిడవిట్లో విద్యార్హతగా  "డిగ్రీ డిస్ కంటిన్యూడ్" అని రాశారన్నారు.                                 
 
2019 సాధారణ ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ డిస్ కంటిన్యూడ్ గా ప్రకటించిన తమ్మినేని  .. అదే సంవత్సరం ఎల్ఎల్బీ 3సంవత్సరాల కోర్సులో అడ్మిషన్ పొందడం ఎలా సాధ్యమైంది రాజ్యాంగబద్ధమైన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ హెూదాలో ఉన్నారని చదవులలో ఏమైనా మినహాయింపులు ఉన్నాయా  ? అని నర్సిరెడ్డి ప్రశఅనించారు.   డిగ్రీ లేని వారికి కూడా 3ఏళ్ల ఎల్ఎల్బీలో ప్రవేశానికి సభాపతులకు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  అసంపూర్తి డిగ్రీతో 3 ఏళ్ల ఎల్ఎల్డీలో చేరేందుకు.. విశ్వ విద్యాలయ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు.      

తాను వెల్లడించిన అంశాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం,  ఉస్మానియా యూనివర్సిటీ వాళ్లు స్పందించాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. "  దీనిపై అత్యున్నతస్థాయి విచారణ జరిపి ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని జరిగాయో, ఇంకెంతమంది ఇలా అనర్హులు అడ్వకేట్లు అయ్యారో  వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.  తమ్మినేని సీతారాం తనకున్న అసలైన పట్టాలేమిటో, అర్హతలేమిటో సభా సాక్షిగానో, మీడియా సాక్షిగానో, మీ నియోజకవర్గ ప్రజల సాక్షిగానో ఇకనైనా బయటపెట్టాలనిడిమాండ్ చేశారు.                                           

Published at : 23 Mar 2023 03:41 PM (IST) Tags: AP News Tammineni Sitaram Nannuri Narsireddy

సంబంధిత కథనాలు

Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి

Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్