అన్వేషించండి

AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్

Andhra Pradesh Rains | ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

అమరావతి: ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీలో మరో నాలుగు రోజులపాటు అకాల వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేశాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి.

 సోమవారం (మార్చి 23) నాడు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

ఈదురు గాలులతో కూడిన వర్షాలు 
వర్షం కురిసే సమయంలో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొలాల్లో పనిచేసే వారు, గొర్రెల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ సూచించింది.

ఉష్ణోగ్రతల పెరుగుదల
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, భానుడి ప్రతాపంతో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆదివారం నాడు అనకాపల్లి,  విశాఖపట్నం  ఏలూరు, పోలవరం, కాకినాడ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో పాటు ఒక్కసారిగా మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

గత కొన్నేళ్లుగా హైదరాబాద్ వాతావరణంలో మార్పులు..

రుతుపవనాలు బలహీనపడుతున్నాయని కొందరు భావిస్తున్నప్పటికీ, వాస్తవానికి 2019 నుంచి హైదరాబాద్ నగరంలో వరుసగా భారీ వర్షాలు నమోదవుతున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వడం గత కొన్నేళ్లుగా మనం గమనిస్తున్న ప్రధాన మార్పు అన్నారు. అయితే, పట్టణ ప్రాంతాల్లో మారుతున్న సూక్ష్మ వాతావరణ పరిస్థితుల (Urban Microclimatic Conditions) కారణంగా వర్షపాతంలో అనిశ్చితి పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల వాతావరణ నమూనాలలో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తున్నాయి.

ఉష్ణోగ్రతల విషయానికి వస్తే 2019 నుండి 2024 మినహా వచ్చిన అన్ని వేసవి కాలాల్లోనూ వేడి సాధారణం కంటే తక్కువగానే నమోదైంది. అంటే మిగిలిన సంవత్సరాలతో పోలిస్తే వేసవి తీవ్రత కొంత తక్కువగానే ఉందని చెప్పవచ్చు. మరోవైపు, వింటర్ సీజన్లలో మాత్రం 2019 నుంచి కాస్త వెచ్చగానే ఉంటున్నాయి. కేవలం 2025 సీజన్‌లో మాత్రమే సాధారణ శీతాకాల పరిస్థితులు కనిపించాయి. ఇటీవల సైతం దాదాపు వారం రోజులపాటు తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
15-10-2026 నవరాత్రి 5వ రోజు లలితా త్రిపురసుందరిగా దుర్గమ్మ! ఈ అలంకారం విశిష్టత తెలుసా?
15-10-2026 నవరాత్రి 5వ రోజు లలితా త్రిపురసుందరిగా దుర్గమ్మ! ఈ అలంకారం విశిష్టత తెలుసా?
AP TDP Janasena Social Media War: ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?
ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget