అన్వేషించండి

AP News: ఏపీలో అంగన్వాడీ పిల్లలకు ప్రత్యేక కిట్లు - అందులోని 19 రకాల వస్తువులు ఇవీ

AP News: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల కోసం ప్రత్యేక కిట్లను అందించబోతుంది. పలక, స్కెచ్ పెన్సిళ్లతో పాటు రబ్బర్, షార్పనర్లను ఈ కిట్టు ద్వారా చిన్నారులకు ఇవ్వబోతుంది. 

AP News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారుల కోసం అద్భుతమైన కిట్లను అందించేందుకు సిద్ధం అవుతోంది. ఆడుతూ పాడుతూ చదువుకునే చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే విధంగా ఉండే వస్తువులను ఈ కిట్టులో చేర్చింది. ఒక పలక, రెండు పెన్సిళ్లు, 12 స్కచ్ పెన్సిళ్లు, ఓ రబ్బర్, షార్ప్ నర్ తో కూడిన కిట్టును ప్రతీ విద్యార్థికి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఈ నెలాఖరులోగా వీటిని చిన్నారులను అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 3 నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించి... వారి చుదవుకు బలమైన పునాదులు వేసేలా ఈ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న 8.50 లక్షల మంది పిల్లలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీని చేపట్టబోతుంది. 

ఇప్పటికే 19 రకాల ఆట వస్తువులతో ప్రత్యేక కిట్ 
ఇటీవలే 19 రకాల ఆట వస్తులతో ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి ఒక్కో కిట్టును అందజేసింది. ఆ కిట్ లో చిన్నారులకు ఉపయోగపడే మ్యాట్, సాఫ్ట్ బాల్, చెక్కతో చేసిన సంఖ్యల పజిల్, పెగ్ బోర్డు, అబాకస్, చెక్క బూట్లు, బిల్డింగ్ బ్లాక్ లు, గమ్ స్టిక్స్, 25 ముక్కల రంగుల పేపర్లు, 5 సెట్ల వాటర్ కలర్స్, 5 సెట్ల స్కెచ్ పెన్నులు, 5 ప్యాకెట్ల పెన్సిళ్లు, 5 రబ్బర్లు, 5 షార్ప్ నర్లు. నమూనాల ట్రేసింగ్ బోర్డు, డాఫ్లి, బ్లోయింగ్ సంగీత వాయిద్యాలు, 20 పలకలు బొమ్మలు తయారు చేసేలా 5 సెట్ల మౌల్డింగ్ క్లే, మూడు ప్యాకెట్ల డస్ట్ ఫ్రీ సుద్ధలు, బంతితో బాస్కెట్ బాల్ హోప్, 20 కథల పుస్తకాలు అందించారు. 

ఆహారంలో మునగాకు ఉండేలా ఏర్పాట్లు..! 
ఇదే కాకుండా అంగన్‌వాడీలకు అందించే ఆహారంలో మునగాకును ప్రభుత్వం చేర్చింది. ఇప్పటి వరకు పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన మెను విజయవంతం అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. పోషల విలువలు ఎక్కువ ఉండే మునగాకు వారానికి రెండు రోజులు అందివ్వనున్నారు. దీని వల్ల గర్భిణులు బాలింతలు, చిన్నారల ఆరోగ్య సమస్యలకు చెక్‌ చెప్పవచ్చని ఆలోచన. మునగాకు చేసే మేలు మరే ఇతర ఆకు కూరలు చేయవని చాలా మంది నమ్ముతున్నారు. రోజువారి ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోమని వైద్యులు కూడా చెబుతున్నారు. పసిబిడ్డలకు పాలిచ్చే తల్లులు మునగాకును తీసుకుంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. దీన్ని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు.

మునగాకులో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మునగాకులో ఉంటే ఫ్లేవానాయిడ్లు కారణంగా రక్తపోటును తగ్గిస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, రక్తంలో చక్కెర, కొవ్వులను నియంత్రించి.. గుండె పని తీరు మెరుగు పరచడంలో ఇది బాగా పని చేస్తుంది. అందుకే దీన్ని అంగన్‌వాడీ మెనూలో చేర్చాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. ఓ గ్రామంలో మునగ చెట్లను పెంచి ఆ చెట్టు నుంచి వచ్చే ఆకులను గర్భిణులకు, బాలింతలకు అందజేసింది. మునగాకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో రూపంలో లబ్దిదారులకు అందజేసింది. వారానికి రెండు రోజులు దీన్ని ఇవ్వాలని ఇప్పుడు నిర్ణయించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget