అన్వేషించండి

Andhra Pradesh: భ‌వ‌న నిర్మాణాల‌కు సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమ‌తులు - మంత్రి నారాయ‌ణ నిర్ణయం

Andhra Pradesh News | ఏపీలో భవనాల నిర్మాణం కోసం సింగిల్ విండో ఏర్పాటు చేసి త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh Minister Narayana | అమ‌రావ‌తి: భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి త్వ‌రిత‌గ‌తిన అన్ని అనుమ‌తులు మంజూరయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖల మంత్రి పొంగూరు నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు. భ‌వ‌నాల నిర్మాణాల కోసం అనుమ‌తులిచ్చే శాఖ‌ల అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. 

ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయా శాఖ‌ల వారీగా అనుమ‌తులు జారీ చేస్తున్న విధానాన్ని, పర్మిషన్ కోసం తీసుకుంటున్న గ‌డువు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి నారాయ‌ణ‌ (AP Minister Narayana). అన్ని శాఖ‌ల‌ను ఆన్ లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవ‌స‌ర‌మైన సాంకేతిక ప‌రిజ్జానాన్ని అందుబాటులోకి తీసుకురావాల‌న్నారు. భ‌వ‌న నిర్మాణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఆయా శాఖ‌ల‌కు వేర్వేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఒక్కో శాఖ నుంచి అనుమ‌తి రావ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుందని, ఈ జాప్యాన్ని త‌గ్గించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు.
ఆన్ లైన్ అనుమతులు డీపీఎంఎస్ వెబ్ సైట్‌కు లింక్
భ‌వ‌న నిర్మాణాల‌ కోసం అగ్నిమాప‌క శాఖ అనుమ‌తి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీని కోసం ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇస్తున్న ఆన్ లైన్ అనుమ‌తుల అప్లికేష‌న్ ను DPMS వెబ్ సైట్ కు అనుసంధానం చేస్తే స‌రిపోతుంద‌ని మంత్రి నారాయణ సూచించారు. ఇక గ‌నుల శాఖ కూడా పెద్ద‌పెద్ద భ‌వ‌నాల విష‌యంలో అనుమ‌తులు జారీ చేయాల్సి ఉంటుంది. భ‌వ‌న నిర్మాణాల కోసం భారీ గుంత‌ల తవ్వ‌కాల కోసం గ‌నుల శాఖ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. దీనికి సంబంధించి సీన‌రేజి ఫీజు చెల్లించాలి. ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తుల విష‌యంలో ప్ర‌స్తుతం ఇదే ర‌క‌మైన విధానాన్ని పాటిస్తున్నారు. ఈ విధానాన్నే భ‌వ‌న నిర్మాణాల అనుమ‌తుల‌కు అనుసంధించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి సూచించారు.

మ‌రోవైపు భ‌వ‌న నిర్మాణం స‌మ‌యంలోనే ఎంత‌మేర ఇసుక అవ‌స‌రం అవుతుంద‌నే వివరాలు ఇవ్వాల‌ని గ‌నుల శాఖ అధికారులు కోరారు. దీనికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జారోగ్య శాఖ చీఫ్ ఇంజినీర్ గోపాల కృష్ణా రెడ్డికి మంత్రి నారాయ‌ణ సూచించారు. ల్యాండ్ కన్వ‌ర్ష‌న్ కు సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చే అనుమ‌తులు సుల‌భ‌త‌రం చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంట్లో భాగంగా ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు ఇస్తున్న విధానాన్ని ఏకీకృతం చేయాల‌ని నిర్న‌యించారు. ఆయా శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో సింగిల్ విండో ద్వారా అనుమ‌తులు జారీ చేసేలా వీలైనంత త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌కు సూచించారు.

టీడీఆర్ బాండ్ల‌ జారీలో అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట కోసం రిజిస్ట్రేష‌న్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వంద‌ల కోట్ల అక్ర‌మాలు చోటుచేసుకున్న టీడీఆర్ బాండ్ల జారీపై ప్ర‌భుత్వం దృష్టి పెట్టినట్లు మంత్రి నారాయణ తెలిపారు. భ‌విష్య‌త్తులో బాండ్ల జారీలో అక్ర‌మాలు జ‌ర‌గ‌కుండా ఉండేలా ప‌గ‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటుందన్నారు. దీని కోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకెళ్లాల‌ని నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే ఈ అంశంపై ఓసారి రెవెన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ తో చ‌ర్చించిన మంత్రి నారాయణ‌.. మంగళవారం జ‌రిగిన స‌మావేశంలో ఈ అంశంపై అధికారుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. వాస్త‌వంగా భూమి కోల్పోతున్న స‌ర్వే నెంబ‌ర్ కు బ‌దులు దొంగ స‌ర్వే నెంబ‌ర్లు వేసి బాండ్ల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్నార‌నే విష‌యం సమావేశంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. 

రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో ఇంటి నెంబ‌ర్ ల డేటా లేక‌పోవ‌డంతో స‌ర్వే నెంబ‌ర్లు, అక్క‌డ ప్రాంతం ఆధారంగా భూముల ధ‌ర నిర్ధారిస్తున్నారు. ఇలా నిర్ధారించే స‌మయంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌కు సూచించారు. బాండ్ల జారీ స‌మ‌యంలో భూమికి సంబంధించిన ఈసీలు ఆన్ లైన్ లో ఆటోమేటిక్ గా వ‌చ్చేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయాల‌ని మంత్రి నారాయణ సూచించారు. ఓన‌ర్ షిప్ డాక్యుమెంట్ లు కూడా ఆన్ లైన్ లో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్స్ శాఖ ఐజీ శేష‌గిరి బాబు చెప్పారు. వారంరోజుల్లో ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక శాఖ‌కు టీడీఆర్ బాండ్ల జారీకి అవ‌స‌ర‌మైన అన్ని అంశాల‌తో స‌మీకృతం చేసేలా సాంకేతిక ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.
Also Read: నడికుడి మీదుగా వెళ్లే ట్రైన్స్‌లో వరుస చోరీలు - 24 గంటల వ్యవధిలోనే మూడు రైళ్లలో దొంగతనాలు

సీడీఎంఏ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి పుర‌పాల‌క శాఖ క‌మిష‌న‌ర్ మ‌రియు డైరెక్ట‌ర్ హ‌రినారాయ‌ణ‌న్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ల శాఖ ఐజీ శేష‌గిరి బాబుతో పాటు ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక విభాగం, రెవెన్యూ, గ‌నులు, అగ్నిమాప‌క శాఖల అధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలుజవాన్ల త్యాగాలను కళ్లకు కట్టే బీఎస్‌ఎఫ్ మ్యూజియం, ఎక్కడుందంటే?Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Akhanda 2: బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
బాలకృష్ణ ‘అఖండ 2’లో చైనీస్ విలన్? వైరల్ పోస్ట్ చూశారా?
Ravi Basrurs: ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
ఎన్టీఆర్ కు రవి బస్రూర్ అదిరిపోయే మ్యూజికల్ గిఫ్ట్, ‘దేవర’ రిలీజ్ కు ముందు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Embed widget