News
News
X

Dress Code : వైద్య విద్యార్థులు డ్రస్ కోడ్, జీన్స్ ఫ్యాంట్ టీ షర్టులు ధరించొద్దని ఆదేశాలు!

వైద్య విద్యార్థుల వస్త్రధారణపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పలు సూచనలు చేసింది. జీన్స్ ఫ్యాంట్, టీ షర్టులు ధరించకుండా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.

FOLLOW US: 
Share:

 వైద్య విద్యార్థుల వస్త్రధారణపై నూతన నిబంధనలు అమలులోకి తీసుకువచ్చేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. వైద్య విద్యార్దులు జీన్స్ ఫ్యాంట్, టీ షర్టులు ధరించకుండా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా ఈ తరహా దుస్తులను ధరించకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. మహిళా విద్యార్థులు చీరలు, లేదంటే చుడీదార్లు మాత్రమే ధరించాలంటూ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు అలాగే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని క్లీన్ షేవ్‌తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయవద్దని సూచించింది. అలాగే తప్పనిసరిగా స్టేతస్కోప్, యాప్రాన్ ధరించాలని ఆ ఆదేశాల్లో  పేర్కొంది. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తిలోదకాలివ్వడంతో గుర్తించిన అధికారులు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు..రోగులు సహయకులు లేకుండా వస్తే,ఆ వంకతో వారిని ఆసుపత్రిలో చేర్చుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్య విభాగం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అంటున్నారు.

అధికారులు నో కామెంట్స్

రాష్ట్ర వైద్య విధాన మండలి తీసుకున్న నిర్ణయంపై అధికారులు మాత్రం స్పందించటం లేదు. అసలు విద్యార్దులు ఎలాంటి దుస్తులు ధరించాలి, వాటి వలన వస్తున్న ఇబ్బందులు ఏంటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు వంటి అంశాలపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలని అంటున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు నూతన విధానాలు అమలు చేసే సమయంలో వస్తున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని దశల వారీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

దుస్తులు ఎలా ఉండాలి...

వైద్య విద్యార్దులు దుస్తులపై ఇప్పుడు కాదు,దశాబ్దాలుగా చర్చ నడుస్తూనే ఉంది. మొదట్లో వైద్య విభాగంలో ఉన్న మహిళలు, స్కర్ట్ లను ధరించే పద్దతి ఉండేది. బ్రిటీష్ కాలం నుంచి ఇదే పద్దతి కొనసాగుతున్నా కాలక్రమంలో వచ్చిన మార్పులు కారణంగా వైద్య విభాగంలో పని చేసే మహిళా సిబ్బంది స్కర్ట్ నుంచి మినహాయించి ఫ్యాంట్ షర్ట్ తో పాటుగా తల పై ప్రత్యేకంగా క్యాప్ ను అందించారు. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మరింత మార్పులు వచ్చాయి. మోడరన్ దుస్తులు అందుబాటులోకి రావటం ఈజీ వేరింగ్ కు యువత మక్కువ చూపటంతో రకరకాలుగా దుస్తులను ధరించి విధులకు హాజరు అవుతున్నారు. దీని వలన రోగులు వారి సహాయకులకు కూడా ఇబ్బందిగా మారింది. ప్రధానంగా ఆలోచనా విదానాల్లో వచ్చిన మార్పులతో వస్త్రదారణ ప్రధాన అంశంగా మారటంతో వైద్య రంగంలో పని చేసే వారికి యూనిఫారం   అజెండా కావటం కొనసమెరుపు. 

నేటి నుంచి అమల్లోకి 

 ఏపీలో పలు విద్యా సంస్థల్లో విద్యార్థులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. బోధనాస్పత్రుల్లో ఉండే సిబ్బంది వస్త్రధారణతో నియమ, నిబంధనలు విధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. డీఎంఈ కార్యాలయంలో జరిగిన సమీక్షలో వైద్య విద్యార్థుల డ్రెస్ కోడ్ పై నిర్ణయం తీసుకున్నారు. బోధనాసుపత్రులకు పంపిన సూచనల్లో డ్రస్‌ ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. బోధనాస్పత్రుల్లో ఉండే సిబ్బంది వస్త్రధారణతో పలు నిబంధనలు విధించారు.  వైద్య విద్యార్థులు, వైద్యుల డ్రస్‌ కోడ్‌ శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.

Published at : 02 Dec 2022 08:05 PM (IST) Tags: AP News AP Govt Medical Students medical students dress dress code medical board

సంబంధిత కథనాలు

Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం

Annamayya District Crime: విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు- అన్నమయ్య జిల్లాలో కలకలం

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజకీయంగా కోటంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టే- కాకాణి ఘాటు వ్యాఖ్యలు

రాజకీయంగా కోటంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టే- కాకాణి ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Hanuma Vihari: శెబ్బాష్‌ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్‌ చేశాడు!

Hanuma Vihari: శెబ్బాష్‌ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్‌ చేశాడు!