Counting Count Down : పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్ డౌన్ ! వైఎస్ఆర్‌సీపీకి ఏకపక్ష ఫలితాలు ఖాయమేనా ?
పోలింగ్ జరిగన 5 నెలల తర్వాత పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో ఆదివారం కౌంటింగ్ నిర్వహిస్తారు. క్లీన్ స్వీప్ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.
పరిషత్ ఎన్నిక కౌంటింగ్ కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఆదివారం పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం కల్లా ఫూర్తి ఫలితాలు వెలువడడతాయి. పూర్తి స్థాయిలో కోవిడ్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్‌ఈసీ నీలం సహాని ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను అధికారులకు అందించారు. Also Read : డ్రగ్స్ కేసులో తరుణ్, పూరీలకు క్లీన్ చిట్ ! మరి మిగతా వాళ్ల సంగతేంటి ?
ఏపీలో మొత్తం 10 వేల 47 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2020 మార్చి 7న మొత్తం 9 వేల 672 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో 2 వేల 371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం660 జెడ్పీటీసీ స్థానాల్లో పలు కారణాలతో నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో 8 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అభ్యర్థులు మృతి చెందడంతో 11 చోట్ల పోలింగ్ ఆగిపోయింది. 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అయితే కౌంటింగ్ జరపవద్దన్న ఆదేశాలు ఉండటంతో బ్యాలెట్ బాక్సుల్లోనే అభ్యర్థుల జాతకాలు ఉండిపోయాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 1న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 8న ఈ ఎన్నికలు జరిగాయి. వాటిని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి మే 21న ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం గురువారం రద్దు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికల్లో పోటీచేసిన మరికొందరు దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది. అప్పీళ్లు పరిష్కారమయ్యేవరకు ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటనను నిలువరిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. దాంతో కౌంటింగ్ చేపడుతున్నారు.
Also Read: Political Foul Language : తిట్లకు తిట్లే సమాధానం ! ఏపీ రాజకీయాలు దారి తప్పాయా !?
పరిషత్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఎన్నికలు ఏ మాత్రం స్వేచ్చగా జరిగలేదని.. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారన్న కారణంగా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా టీడీపీ ప్రకటించింది. అయితే నిర్ణయం తీసుకునే సరికి అప్పటికే నామిషన్లు.. ఉపసంహరణలు కూడా పూర్తి కావడంతో టీడీపీ అభ్యర్థులు పోటీ ఉన్నట్లే. సైకిల్ గుర్తుతో అభ్యర్థులు బరిలోఉంటారు. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు సీరియస్‌గానే ప్రయత్నించడంతో ఫలితాలపై ఉత్కంఠ ప్రారంభమయింది.
Also Read : య్యన్న వ్యాఖ్యలపై జోగి రమేష్ ఒక్కరే ఎందుకు స్పందించారు ? వ్యూహమా ? రాజకీయమా ?