Kondapalli Issue: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కేసులో మరో ట్విస్ట్... కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నట్లు న్యాయమూర్తి హైకోర్టు సీజేకు తెలిపారు. దీంతో మరో బెంచ్ కు కొండపల్లి కేసు వెళ్లనుంది.
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టులో ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకున్నారు. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తితో వైసీపీ కౌన్సిలర్ల తరపు న్యాయవాది వాదనకు దిగారు. పదే పదే వాదన పడటంతో తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీజేకు న్యాయమూర్తి తెలిపారు. దీంతో మరో బెంచ్ కు ముందుకు కొండపల్లి మున్సిపల్ కేసు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో ఓటు హక్కు అంశంలో న్యాయమూర్తితో వైసీపీ కౌన్సిలర్ల న్యాయవాది వాదన దిగారు.
Also Read: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం... జీవోలు రహస్యం, అతి రహస్యమని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్న
విచారణ నుంచి తప్పుకున్న న్యాయవాది
కొండపల్లి కౌన్సిలర్ల తరఫు న్యాయవాది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌తో విచారణ సమయంలో వాదనకు దిగారు. దీంతో న్యాయమూర్తి విచారణ నిలిపివేశారు. ఈ కేసు విచారణలో తాను వాదనలు వినబోనని ఆయన స్పష్టం చేశారు. కేసు విచారణను మరో బెంచ్‌కు పంపాలని సీజేకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కోరారు. ఈ విచారణకు సంబంధించి కారణాలు రికార్డు చేయాలని ఎంపీ కేశినేని నాని తరఫు న్యాయవాది కోరగా... కారణాలు రికార్డు చేస్తున్నామని జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. అనంతరం కేసు విచారణ బెంచ్ నుంచి తప్పుకున్నట్టు ఆయన ప్రకటించారు.
Also Read: చంద్రబాబు క్షమించినా ... నేను వదలను.. వైఎస్‌ఆర్‌సీపీ లీడర్స్‌కు లోకేష్ మాస్ వార్నింగ్
కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక వివాదం
కొండపల్లి నగర పంచాయతీలో 29 వార్డులు ఉన్నాయి. ఇందులో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెరో 14 స్థానాలు గెల్చుకున్నాయి. ఓ స్థానాన్ని టీడీపీ రెబల్ అభ్యర్థి గెల్చుకున్నారు. అయితే వెంటనే ఆ కౌన్సిలర్ టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ బలం 15కు చేరుకుంది. ఎక్స్ అఫీషియో మెంబర్‌గా టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది. వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓటు హక్కు లభించింది. దీంతో బలాలు టీడీపీకి 16, వైఎస్ఆర్‌సీపీకి 15 తేలాయి. టీడీపీకి ఛైర్మన్ పీఠం లభించడం ఖాయం అయింది. అయితే కొండపల్లిని తామే గెల్చుకుంటామని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతూ వచ్చారు. దీంతో ఛైర్మన్ ఎన్నికను వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఎన్నిక వాయిదా పడేలా చేశారని అంటున్నారు. నిజానికి 16 మంది సభ్యులు ఉంటే కోరం ఉన్నట్లే. ఎన్నికలు నిర్వహించాలి. కానీ మున్సిపల్ కమిషనర్ ఎన్నికను నిర్వహించకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికను వాయిదా వేయించారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎంపీ కేశినేని నాని ఓటు వినియోగిచుకోడం చట్ట విరుద్ధమంటూ వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: నెల్లూరులో భారీ స్కామ్, అసలు వాహనాలే లేవు.. అయినా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు, ఎలా జరిగిందంటే..