(Source: ECI/ABP News/ABP Majha)
Rajadhani Files : రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనలపై హైకోర్టు స్టే - పలు చోట్ల షో మధ్యలోనే ఆపేసిన పోలీసులు !
Rajadhani Files : రాజధాని ఫైల్స్ సినిమాపై హైకోర్టు స్టే విధించింది. తీర్పు వచ్చిన వెంటనే ధియేటర్లలో సినిమా ప్రదర్శన నిలిపివేశారు.
AP High Court stayed the Rajdhani Files movie : : రాజధాని ఫైల్స్(Rajdhani Files) సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) మధ్యంతర ఉత్వర్వులు(Interim orders) జారీ చేసింది.శుక్రవారం వరకు సినిమాను నిలిపివేయాలని హైకోర్టు ఆదే శాలిచ్చింది. సినిమాకు సంబధించి పూర్తి రికార్డులను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఈ సినిమా తీశారని, సెన్సార్ బోర్టు జారీ చేసిన ధ్రువ పత్రాన్ని చేయాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీని చులకన చేయాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మించారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
వైసీపీని అప్రతిష్ట పాలు చేయడానికేనని పిటిషన్
రాజధాని ఫైల్స్ పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడమేనని వైసీపీ తరపు లాయర్లు వాదించారు. అవాస్తవాలతో ప్రజలను మ«భ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిరి్మంచారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ప్రజల్లో వైఎస్సార్‌సీపీని పలుచన చేయాలన్న ఉద్దేశం కూడా ఉందన్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహా పార్టీ పెద్దలందరినీ అప్రతిష్ట పాల్జేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర సభ్యులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాత్రల పేర్లు కూడా నిజ జీవితంలో ఆయా వ్యక్తుల పేర్లను పోలి ఉన్నాయన్నారు.
ట్రైలర్ లోనే అభ్యంతరాలు ఉన్నాయని వాదనలు
ఈ నెల 5వ తేదీన రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదల చేశారని, అందులో ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని న్యాయవాది ప్రశాంత్ వివరించారు. చిత్ర నిర్మాతలు తమ స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీని బలి పశువును చేస్తున్నారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఎప్పుడూ కూడా పరిమితులకు లోబడి ఉంటుందని వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చిత్ర నిర్మాతలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంతమాత్రం సరికాదని కూడా వివరించామన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శనకు సీబీఎఫ్‌సీ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారని వైసీపీ తరపు న్యాయవాదులు వాదించారు.
కోర్టు తీర్పు రాగానే ప్రదర్శనలు నిలిపివేత
కోర్టు తీర్పు వెలువగానే పలు చోట్ల పోలీసులు రెవిన్యూ అధికారులు సినిమా ప్రదర్శనను రె అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్ మాల్‌లో అర్ధంతరంగా నిలిపివేశారు. మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. రామకృష్ణ థియేటర్ వద్ద ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది.