అన్వేషించండి

YSR Kalyanamastu Scheme : ఆడబిడ్డలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, అక్టోబర్ 1 నుంచి కళ్యాణమస్తు పథకానికి శ్రీకారం

YSR Kalyanamastu Scheme : ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

YSR Kalyanamastu Scheme : ఎన్నికల మేనిఫెస్టోలోని మరో కీలక హామీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం శనివారం జారీ చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేయనున్నారు.  వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లు అవుతోందని వెల్లడించింది.  కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద

  • ఎస్సీలకు రూ. 1 లక్ష, 
  • ఎస్సీల కులాంత వివాహాలకు రూ.1.2 లక్షలు  
  • ఎస్టీలకు రూ. 1  లక్ష
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • బీసీలకు  రూ. 50 వేలు
  • బీసీల కులాంత వివాహాలకు రూ.75 వేలు
  • మైనార్టీలకు రూ. 1 లక్ష
  • వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు
  • భవన నిర్మాణకార్మికులకు రూ.40 వేలు 

టీడీపీ హయాంలో కాగితాలకే పరిమితం 

ఈ పథకంతో వైసీపీ మేనిఫెస్టోను 98.44 శాతం హామీలు అమలుచేశామని సీఎం జగన్ తెలిపారు.  దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దామన్నారు. రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా వైసీపీ మేనిఫెస్టో నిలుస్తోందన్నారు.  గత ప్రభుత్వంలో కళ్యాణమస్తు పథకం కాగితాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు హయాంలో పథకాలు ఆర్భాటం జాస్తి, అమలు నాస్తి అని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఈ పథకం ఉన్నా కాగితాలకే పరిమితం అయిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకూ పెళ్లి కానుక లభించలేదన్నారు.  2017లో బీసీలను పథకంలో చేర్చినా వారికి పెళ్లికానుక అందలేదన్నారు.  2018–19 నాటికి 17,709  మందికి పెళ్లి కానుక ఎగ్గొట్టారని సీఎం జగన్ ఆరోపించారు.  పెండింగ్ పెట్టి రూ. 68.68 కోట్లు చంద్రబాబు  సర్కారు ఎగ్గొటిందని ఆరోపించారు. లబ్ధిదారులకు ఇవ్వాలన్న కోణంలో కాకుండా, ఎలా ఎగ్గొట్టాలన్న కోణంలో నియమాలు, నిబంధనలు పెట్టారన్నారు. అర్హులందరికీ వర్తించేలా వైసీసీ ప్రభుత్వం పథకాన్ని కొత్త పథకాన్ని తీర్చిదిద్దిందన్నారు.  గత ప్రభుత్వం కన్నా అధిక నగదు పేద కుటుంబాలకు ఇస్తున్నామన్నారు. 

  • ఎస్సీలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు కింద రూ. 1 లక్ష రూపాయలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 40 వేలు
  • ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది రూ.75 వేలు 
  • ఎస్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50 వేలు
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 75వేలు
  • బీసీలకు  రూ. 50 వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.35 వేలు
  • బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 50 వేలు
  • మైనార్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు
  • వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 1లక్ష మాత్రమే
  • భవన నిర్మాణకార్మికులకు రూ.40 వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.20వేలు 

ఈ పథకం పొందేందుకు అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాల నిబంధన విధించింది రాష్ట్ర ప్రభుత్వం. అర్హతలను జీవోలో పొందుపరిచింది.  ఈ పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి ఉంచింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget