అన్వేషించండి

Sajjala : గురువారం నుంచి ఏపీలో " వై ఏపీ నీడ్స్‌ జగన్‌ " - అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామన్న సజ్జల

వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించనుంది. అభివృద్ధిని ప్రజలకు చూపిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.


Sajjala : గురువారం నుంచి ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) ప్రకటించారు.  సీఎం జగన్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి ఉన్నాయన్నారు.  సంక్షేమం ద్వారా అభివృద్ధి, సంక్షేమమే అభివృద్ధి అని ప్రభుత్వం భావిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.  సచివాలయం ద్వారా జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు పెడుతున్నాం. ఇది కదా అభివృద్ధి అనే విధంగా ప్రజలకు చూపిస్తామని ప్రకటించారు. చంద్రబాబు ( Chandrababu ) పాలనలో తలసరి ఆదాయంలో 17వ స్థానంలో ఉంటే ఇప్పుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నామని సజ్జల పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. 2019లో ఏపీ ( Andhra  ) జీఎస్‌డీపీ 22వ స్థానం కాగా.. 2021-22లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. విద్య, వైద్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు. 

కుట్ర పూరితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు  ప్రయత్నం                    

కుట్రపూరితంగా మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ప్రతి స్కీమ్‌లోనూ స్కామ్‌ ఉందన్నారు.  ప్రతి స్కీమ్‌లోనూ వచ్చే లాభంపైనే చంద్రబాబు ఫోకస్‌ చేశారన్నారు.  అయితే కులమతాలకు అతీతంగా పారదర్శక పాలన సీఎం జగన్‌ అందిస్తున్నారన్నారు.  వరలో డోర్‌టు డోర్‌ క్యాంపెయిన్‌ మొదలు పెడతామని స్పష్టం చేశారు.   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 4.93 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  

కోవిడ్ సమయంలో  రోల్ మోడల్ గా నిలిచిన ఏపీ                                 

కోవిడ్‌ సమయంలో ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. మహమ్మారి అవతరించిన సమయంలోనూ రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉన్నామనే భావన పొందారని పేర్కొన్నారు. అభివృద్ధి పరంగా మంచి ప్రగతిని సాధించామని తెలిపారు. రూ. 16,500 కోట్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామని సజ్జల చెప్పారు. వ్యవసాయంలో గత హయాంలో 27వస్థానం ఉంటే.. అప్పట్లో వృద్ధి రేటు 6.5శాతం ఉండేందని ప్రస్తావించారు. ప్రస్తుతం వ్యవసాయంలో ఏపీ 6వ స్థానంలో ఉందని, వృద్ధిరేటు 8శాతం సాధించామని తెలిపారు. తలసరి ఆదాయంలో ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నామని, ఈ మ్యానిఫెస్టోనే వైస్సార్‌సీపీ ప్రభుత్వానికి గీటురాయని పేర్కొన్నారు. 

'వై ఏపీ నీడ్స్ జగన్' పార్టీలకు అతీతమైన కార్యక్రమం               

'వై ఏపీ నీడ్స్ జగన్' కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతోందని... వైసిపి పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమం గురించి ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసని సజ్జల అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనవచ్చని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులను అంకెలతో సహా  చెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. ఎక్కడికక్కడ స్థానిక నాయకులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సజ్జల వెల్లడించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget