ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23వ తేదీ నుంచి దీనికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు.
ఏపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం వైఎస్సార్ నేతన్న హస్తం పథకాన్ని తీసుకొచ్చి గతేడాది డిసెంబర్ నెలలో మొదటి విడత ఆర్థిక సాయాన్ని అందించారు. కరోనా కాలంలో కూడా జగన్ సర్కారు నిరుపేద నేతన్నలకు సాయాన్ని అందించింది. అయితే ఈనెల 23వ తేదీ నుంచి వైఎస్సాఆర్ నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు. కృష్ణా జిల్లా పెడనలో సీఎం జగన్ పర్యటిస్తారు. ఆ తర్వాత బటన్ నొక్కి లబ్ధిదాలు ఖాతాల్లోకి డబ్బులు వేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించి... వారి జాబితాలను సచివాలయాలకు పంపించారు.
ఒక్కొక్కరికీ ఐదేళ్లలో 1.2 లక్షల సాయం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మూడేళ్లుగా సొంతం మగ్గం ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెంది వారికి ఈ పథకం కింద ఏటా రూ.24 వేలు జమ చేస్తోంది. ఇలా ఒక్క పెడన నియోజకవర్గం పరిధిలోనే 3,161 మంది వైఎస్సార్ నేతన్న హస్తం లబ్ధిదారులు ఉన్నారు. చేనేతలకు మంచి జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం కింద సొంత మగ్గాలు ఉన్న నేత కార్మికుల బ్యాంకు ఖాతాలకు 24 వేల రూపాయలను నేరుగా జమ చేస్తున్నారు. ఇలా ఐదేళ్లలో ప్రతీ లబ్ధిదారుడు 1.2 లక్షల సాయాన్ని పొందబోతున్నాడు.
ఈ పథకానికి అర్హులెవరు..?
ఈ పథకం కింద లబ్ధిపొందాలనుకునే వాళ్లు ఏపీకి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే అతడు లేదా ఆమె తప్పనిసరిగా వృత్తిపరంగా చేనేత నేతగా ఉండాలి. దరఖాస్తుదారుడు చేనేత సంఘంలో పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే వ్యక్తి తప్పని సరిగా బిలో పావర్టీ లైన్‌లో ఉండాలి. మగ్గాలు ఎన్ని ఉన్నా.. ఒక కుటుంబంలో ఒకరికే ప్రయోజనం. సచివాలయాలు సిద్ధం చేసిన జాబితాను పరిశీలించి లబ్ధిదారులను గుర్తిస్తారు. వాలంటీర్లు, సిబ్బంది బయోమెట్రిక్ తీసుకొని ఎంట్రీ చేస్తారు. అలా చేసిన బాబితా ఎంపీడీఓ లేదా ఎంసీలు పరిశీలిస్తారు. ఆ తర్వాతే చేనేత శాఖ ద్వారా తుది జాబితా ప్రకటిస్తారు. నేతన్న హస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి అడ్రస్, ఆధార్ కార్డు లేని పక్షంలో ఓటర్ ఐడీ కార్టు వంటి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
ఇవి తప్పనిసరిగా కావాల్సిందే..!
రాష్ట్ర చేనేత సంఘం జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు ఇచ్చే సర్టిఫికేట్, బ్యాంకు ఖాతా వివరాలు కచ్చితంగా సమర్పించాలి. ఇప్పటికే సిద్ధం చేసిన నేతన్న నేస్తం లబ్ధిదారుల జాబితాలు ఆన్‌లైన్‌లో, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలు అన్నీ సచివాలయంతోపాటు అధికారికి వెబ్ సైట్‌లో కనిపిస్తాయి.
Also Read:మాధవ్ వీడియో చుట్టే ఏపీ రాజకీయాలు ! ఇంతకీ తప్పెవరు చేస్తున్నారు?
Also Read: ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత