By: ABP Desam | Updated at : 23 Jan 2023 06:01 PM (IST)
ఏపీ సీఐడీ చీఫ్ ను బదిలీ చేసిన ప్రభుత్వం
AP CID Chief Transfer : ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్‌గా ఉన్న పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఇంకెక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సంజయ్‌కు బాధ్యతలు అప్పగించింది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పీవీ సునీల్ కుమార్ సీఐడీ చీఫ్ గా ఉన్నారు. సీఐడీ అధికారులు ప్రతిపక్ష నేతల్ని తప్పుడు కేసులతో వేధిస్తున్నారని.. నిబంధనలకు విరుద్దంగా అరెస్టులు చేస్తున్నారని తీవ్ర విమర్శలు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయితే హఠాత్తుగా ఆయనను బదిలీ చేయడం పోలీసు వర్గాల్లో సంచలనం రేపుతోంది. సాధారణం సీనియర్ అధికారులను బదిలీ చేస్తే.. పోస్టింగ్ ఇస్తారు. కానీ పీవీ సునీల్ ఒక్కరినే బదిలీ చేశారు.. పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణం ఏమిటన్నదానిపై అధికారవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఆయనకు ప్రమోషన్ ఇచ్చింది. అడిషనల్ డీజీ హోదా ఉండే ఆయనకు డీజీపీ హోదా ఇచ్చింది. అడిషనల్ డీజీపీ హోదాతో సీఐడీ చీఫ్ గా కొనసాగేవారు. డీజీగా ప్రమోషనల్ ఇచ్చారు. సునీల్ కుమార్ 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. పదోన్నతి 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇలా డీజీగా ప్రమోషన్ ఇచ్చిన ఇరవై రోజుల్లోనే ఆయనను బదిలీ చేయడం.. అనూహ్యంగా మారింది. బదిలీకి కారణాలేమిటన్నది మాత్రం స్పష్టం కాలేదు కానీ.. ఉదయమే టీడీపీ యున నేత నారా లోకేష్.. సీఐడీ పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఓ స్థలం వివాదంలో సీఐడీ జోక్యం చేసుకుందని...విల్ కేసుల సెటిల్మెంట్లు, కబ్జాలకి సిఐడిని అడ్డా చేశారని లోకేష్ విమర్శించారు. సిఐడి పేరు వింటేనే జనం ఛీకొట్టేలా ఉందని మండిపడ్డారు.
జగన్ రెడ్డి గారి పాలనలో CID పేరు Crime Involvement Department గా మార్చేశారు. చివరికి సివిల్ కేసుల సెటిల్మెంట్లు, కబ్జాలకి సిఐడిని అడ్డా చేశారు. సిఐడి పేరు వింటేనే జనం ఛీకొట్టేలా ఉంది తీరు.(1/3)#IdhemKarmaManaRashtraniki#PsychoPovaliCycleRavali pic.twitter.com/PKOCiTrH5u
— Lokesh Nara (@naralokesh) January 23, 2023
అయితే లోకేష్ చేసిన ట్వీట్‌కు ... సునీల్ కుమార్ బదిలీకి సంబంధం ఉండదని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా సార్లు సునీల్ కుమార్, సీఐడీ పని తీరుపై టీడీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. ట్వీట్లు చేసింది. కేంద్రానికి.... రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేసింది. కానీ ఒక్క సారి కూడా సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోలేదు. సుదీర్ఘ కాలంగా సీఐడీ చీఫ్ గా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడీ విషయంలో చర్యలు తీసుకుంటారని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారవర్గాలు కూడా భావించడం లేదు.
ఎందుకు బదిలీ చేస్తున్నారన్న కారణం అధికారవర్గాలు కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఎప్పుడూ చెప్పవు. ఇలా ఒక్కరినే.. హఠాత్తుగా బదిలీ చేసేసి.. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయమంటే మాత్రం.. పనితీరుపై అసంతృప్తి లేదా ఆరోపణల వల్ల చేస్తూంటారన్న అభిప్రాయం ఉంటుంది. పీవీ సునీల్ కుమార్ బదిలీ విషయంలోనూ అదే ప్రచారం జరుగుతోంది.
Nellore News : ఇద్దరు రెడ్లు పోతే మరో 10 మంది వస్తారు- ఆనం, కోటంరెడ్డిపై విజయ్ కుమార్ రెడ్డి ఫైర్
Gudivada Amarnath : ఏపీ భవిష్యత్తును విశాఖ మార్చబోతోంది- మంత్రి గుడివాడ అమర్నాథ్
Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం
AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం
Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం