అన్వేషించండి

IPS PV Sunil Kumar: ఐపీఎస్ పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్‌ పొడిగింపు.. అప్పటివరకూ అంతే!

PV Sunil Kumar: ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ పై విధించిన సస్పెన్షన్ మరోసారి పొడిగించింది ఏపీ ప్రభుత్వం. నమోదైన క్రిమినల్ కేసుల విచారణ పూర్తి, లేక రిటైర్మెంట్ ఏది ముందుగా వస్తే అప్పటివరకూ కొనసాగుతుంది.

IPS PV Sunil Kumar Suspension | అమరావతి: రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ (1993 బ్యాచ్) సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ & అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ సస్పెన్షన్ పొడిగింపు వర్తిస్తుందని అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసు విచారణ పూర్తయ్యే వరకు లేదా ఆయన పదవీ విరమణ తేదీ అయిన 30 జూన్ 2026 వరకు.. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే ఆ గడువు వరకు సునీల్ కుమార్ సస్పెన్షన్ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అసలేం జరిగింది.. 
గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నం. 187/2024 కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సమయంలో, అప్పటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ (పోలీసు కస్టడీలో వేధింపులు) ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై తీవ్రమైన క్రిమినల్ సెక్షన్లు ఉన్నాయి. దర్యాప్తు జరుగుతున్న ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో నేరుగా సంబంధం కలిగి ఉన్నందున, పీవీ సునిల్ కుమార్‌ను సర్వీసులోకి తీసుకుంటే సాక్ష్యాధారాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఏపీ  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సునీల్ కుమార్ గతంలో సీఐడీ అడిషనల్ డీజీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై వచ్చిన ఫిర్యాదులు, ముఖ్యంగా కస్టోడియల్ హింసకు సంబంధించిన ఆరోపణలు ఆయన కెరీర్‌లో పెద్ద మలుపుగా మారాయి. ప్రస్తుతం ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలో విచారణలో ఉంది. దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఆయన సస్పెన్షన్‌ను పొడిగించడం పరిపాలనాపరంగా అనివార్యమని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.

పలు కేసుల్లో నిందితుడిగా సునీల్ కుమార్

సునీల్‌ కుమార్‌ అనుమతి లేకుండా 2020 నుంచి 2024 మధ్య విదేశాలకు వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఏపీ ప్రభుత్వం గతంలో చర్యలు చేపట్టింది. వైసీపీ హయాంలో సీఐడీ డీజీగా పనిచేసిన సమయంలో రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసి విచారణ పేరిట అధికారులు తనను కొట్టారని, హత్యాయత్నం చేశారని రఘురామ ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరపాలెం పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అగ్రి గోల్డ్‌ నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget