AP Cinema Tickets: రాధేశ్యామ్ కు గుడ్ న్యూస్, సినిమా టికెట్ల ధరలపై జీవో జారీ
AP Cinema Tickets: సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవో జారీపై హీరో ప్రభాస్ స్పందించారు.
AP Online Tickets: సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల(Cinema Tickets Rates)పై వేసిన కమిటీ నివేదికకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టికెట్ల ధరలు పెరగనున్నట్లు సమాచారం. టికెట్ల ధరల పెంపునకు సీఎం జగన్(CM Jagan) ఆమోదం తెలిపారు. సినిమా టికెట్ల జీవో నేడో, రేపో జారీ చేసే అవకాశముంది. క్యాటగిరీ వారిగా ధరల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్లు నగర పంచాయతీ, పంచాయతీల వారీగా ధరల పెంపును సీఎం జగన్ ఆమోదించినట్లు సమాచారం.
హీరో ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్
ఏపీలో సినిమా టికెట్ల జీవో విడుదల కోసం టాలీవుడ్(Tollywood) ఆసక్తిగా ఎదురుచూస్తుంది. భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టాలీవుడ్ పెద్దలు గతంలోనే ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ప్రభుత్వం కొంత సమయం తీసుకుంది. ప్రభుత్వ కమిటీ సూచనల మేరకు నిర్ణయం ఉంటుందని సర్కార్ వెల్లడించింది. సినిమా టికెట్ల జీవోపై హీరో ప్రభాస్(Prabhas) స్పందించారు. రాధేశ్యామ్ మార్చి 11న విడుదల కాబోతున్న తరుణంలో హీరో ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాధేశ్యామ్ (Radhe Shyam) విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం జీవో ఇస్తే చాలా సంతోషిస్తానని ప్రభాస్ అన్నారు.
సినిమా టికెట్ల జీవోకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల(Cinema Tickets) జీవో విడుదలకు రంగం సిద్ధమైంది. సినిమా టికెట్ ధరల విషయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన కమిటీ టికెట్ ధరలపై తుది ప్రతిపాదనలు ఖరారు చేసి నివేదిక సిద్ధం చేసింది. థియేటర్ క్యాంటీన్లలో ధరలు, భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించి టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రతిపాదనలు, ఐదో షో వేసేందుకు అనుమతి వంటి అంశాలపై కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రజలు, సినీ పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇరు వర్గాలకు మేలు చేకూరేలా సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని కమిటీ సభ్యులు గతంలో ప్రకటించారు. నేడో, రేపో టికెట్ ధరలపై ప్రభుత్వం నుంచి జీవో వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3 స్లాబ్‌లలో టికెట్‌ల ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది. పంచాయతీ, నగర పంచాయతీలు ఒకటో కేటగిరి, మున్సిపాలిటీ లను రెండో కేటగిరీ, కార్పొరేషన్‌లను మరో క్యాటగిరీగా గుర్తించి టికెట్ ధరల నిర్ణయానికి కమిటీ సిఫార్సు చేసింది. టికెట్ల ధరల్లో 2 కేటగిరీలు మాత్రమే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టికెట్ రేట్లపై ఏపీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రిలీజ్ కు భారీ బడ్జె్ట్ చిత్రాలు రెడీ
తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదల సిద్ధమయ్యాయి. టిక్కెట్ల జీవో ఇచ్చిన మరుక్షణమే సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. భీమ్లా నాయక్ సినిమా ముందే జీవో వస్తుందని సినీ ప్రముఖులు భావించినా, ప్రభుత్వం జీవో చేయలేదు. పవన్ కల్యాణ్ పై కక్షతోనే ప్రభుత్వం జీవో విడుదల చేయలేదని జనసేన నేతలు, పవన్ అభిమానులు ఆరోపణలు చేశారు. కమిటీ నివేదికతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమకు ఏమేమి మేలు చేస్తామో చెబుతూ సీఎం జగన్ ఇప్పటికే సినీ ప్రముఖులకు ఓ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి నేతృత్వంలో వచ్చి కలిసిన వారికి టిక్కెట్ రేట్ల పెంపుతో పాటు ఐదో షోకు కూడా అనుమతి ఇస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు వాటితో పాటు కొత్తగా ఏమైనా ప్రయోజనాలు కల్పిస్తారా లేకపోతే కొత్తగా ఏమైనా రూల్స్ పెడతారా అన్నది జీవోలు విడుదలయ్యాకా కానీ స్పష్టత ఉండదు.