Vizag Erramatti Dibbalu : విశాఖ ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాల నిలిపివేత - కలెక్టర్ నుంచి నివేదిక కోరిన సీఎంవో
Visakhapatnam : విశాఖలో ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్న వైనంపై కలెక్టర్ నుంచి సీఎంవో నివేదిక కోరింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా తవ్వకాలు కొనసాగడంపై విమర్శలు వచ్చాయి.
AP CMO : ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసం కొనసాగడంపై వస్తున్న విమర్శలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. తక్షణం అక్కడ తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. అక్కడ తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు.. ఎందుకు తవ్వుతున్నారన్న అంశంపై పూర్తి వివరాలను నివేదిక రూపంలో ఇవ్వాలని విశాఖ కలెక్టర్ ను ఆదేశించింది.
ఎర్రమట్టి దిబ్బలకు భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు
భీమిలి నియోజకవర్గంలో విస్తృతంగా ఉండే ఎర్రమట్టి దిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా భావిస్తారు. అయితే ఇటీవలి కాలంలో అక్కడ చాలా మంది మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల నుంచి ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నాయి. ఇతరంలో విపక్ష పార్టీల నేతలు సందర్శించి కూటమి రాగానే తవ్వకాలు నిలిపివేస్తామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ నెల రోజులుగా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న రేవంత్ - ఈ రాజకీయం వెనుక వ్యూహమేంటి ?
తవ్వకాలు జరిపేందుకు గతంలో అనుమతులు
తవ్వకాలు జరిపే వారు తమకు పర్మిషన్లు ఉన్నాయని వాదించారు.దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ను ఆదేశించింది సీఎంవో. వెంటనే జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఎర్రమట్టి కొండల్లో తవ్వకాలు నిబంధనలకు విరుద్ధమని ప్రాథమికంగా తేల్చారు . మొత్తంగా అనుమతులను ఉల్లంఘించి కొండలను కొల్లగొడుతున్నట్టు అధికారులు గుర్తించి.. తవ్వకాలు ఆపేయాలని ఆదేశించారు. ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకేలా చేయడం ఇక్కడి ఎర్రమట్టి దిబ్బల ప్రత్యేకత.
ఎమ్మెల్యేల ఆకర్ష్‌లో కాంగ్రెస్‌తో పోటీకి నో - బీజేపీ ప్లాన్ వేరే ఉందా ?
తవ్వకాలు నిలిపివేసి నివేదిక కోరిన ఏపీ ప్రభుత్వం
గత ప్రభుత్వంలో భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 1982లో స్థలం కేటాయించారు. అయితే ఆ స్థలంలోనే ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి. బిల్డింగ్ సొసైటీకి సబ్‌డివిజన్ చేసి 118/5ఏ, 118/2 సర్వే నెంబర్లలో కలిపి మొత్తం 280.70 ఎకరాలు ఉంది. దీనిపై వివాదం ఏర్పడింది. సుప్రీం కోర్టులో హౌసింగ్ సొసైటీకే అనుకూలంగా వచ్చింది. 1978లో అప్పటి ప్రభుత్వం తొట్లకొండ చుట్టుపక్కల 3వేల ఎకరాల్లో ఎర్రమట్టి దిబ్బలున్నట్లు గుర్తించి నిషేధిత జోన్‌గా ఆదేశాలు జారీ చేసింది. కానీ 2021లో వైఎస్సార్సీపీ సర్కార్ ఈ ఎర్రమట్టి దిబ్బలను 120 ఎకరాలకే పరిమితం చేసిందని తెలుస్తోంది. దీంతో వివాదం ఏర్పడింది. ఇప్పుడు తవ్వకాల వివాదం రావడంతో నిలిపివేసి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.