CM Jagan: విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్...
బెజవాడ దుర్గమ్మకు ఏపీ సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను సోమవారం దర్శించుకున్నారు. దుర్గగుడికి చేరుకున్న సీఎం జగన్ కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలానక్షత్రం సందర్భంగా మంగళవారం బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను సీఎం జగన్ సమర్పించారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సీఎం జగన్ కు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం
ఆలయ అర్చకులు సీఎంకు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను తలపై పెట్టగా వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య సీఎం జగన్ దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సీఎం జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారని పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలో కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.6782 కోట్లు ఆసరా అందించామన్నారు.
ఇంద్రకీలాద్రి: విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం శ్రీ వైయస్ జగన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి.https://t.co/BSdP4FFOTd
— YSR Congress Party (@YSRCParty) October 12, 2021
Also Read: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్... గరుడ వాహనసేవలో పాల్గొన్న సీఎం
Also Read: 'కౌమారీ పూజ' ఎన్నేళ్ల పిల్లలకి చేయాలి, ఏ వయసువారిని పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది...
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి