అన్వేషించండి

CM Jagan Tirumla Visit: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్... గరుడ వాహనసేవలో పాల్గొన్న సీఎం

తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం గరుడ వాహన సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి, తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు.

తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ పంచకట్టుతో తిరుమలేశుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. అంతకు ముందు తిరుపతి బర్డ్‌ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. 

Also Read: భవిష్యత్తులో అధికారిక కరెంట్ కోతలు... ఇళ్లను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర... సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్

చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ప్రారంభం 

తిరుప‌తిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రి ఆవరణంలో ఏర్పాటుచేసిన‌ శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని సోమ‌వారం సీఎం జగన్ ప్రారంభించారు. ఆసుప‌త్రి ప్రత్యేక‌త‌ల‌పై రూపొందించిన మూడు నిమిషాల నిడివి గ‌ల వీడియోను ముఖ్యమంత్రి వీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతిలో చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని టీటీడీ ఏర్పాటు చేసింది. బర్డ్‌ ఆసుపత్రిలో మొదటి దశలో రూ.25 కోట్ల వ్యయంతో 50 పడకలతో ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఇందులో ఓపీ బ్లాక్‌లో 5 కన్సల్టేషన్‌ గదులు, రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. రేడియాలజీ బ్లాక్‌లో ఎక్స్ రే రూమ్‌, క్యాథ్‌ ల్యాబ్‌, మరుగుదొడ్లతోపాటు రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు జ‌రిగాయి. 15 పడకలతో ప్రీ ఐసీయూ బ్లాక్‌, 15 పడకలతో పోస్ట్‌ ఐసీయూ బ్లాక్‌, మూడు ఆపరేషన్‌ థియేటర్లు, 20 పడకలతో రెండు జనరల్‌ వార్డులు ఉన్నాయి. పరిపాలనా విభాగంలో కార్యాలయం, డాక్టర్ల గదులు, డైరెక్టర్‌ ఛాంబర్‌, సమావేశ మందిరం నిర్మించారు.


CM Jagan Tirumla Visit: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్... గరుడ వాహనసేవలో పాల్గొన్న సీఎం

Also Read: బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై దసరా శోభ.. అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియా..

సప్తగోప్రదక్షిణ మందిరం ప్రారంభించిన సీఎం 

తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్దకు చేరుకున్న సీఎంకు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జేఈవో స‌దా భార్గవి స్వాగతం పలికారు. గోసంరక్షణ లక్ష్యంగా అలిపిరి శ్రీవారి పాదాల వద్ద చెన్నైకి చెందిన దాత అందించిన రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టీటీడీ నిర్మించింది.  



Also Read: రూ.5 కోట్ల కరెన్సీ నోట్లతో కన్యకా పరమేశ్వరి అలంకరణ.. రికార్డు బ్రేక్ చేసిన నెల్లూరోళ్లు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget