అన్వేషించండి

Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Annadata Sukhibhava Status Online | కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కలిసి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశాయి. ఏపీ రైతుల ఖాతాల్లో రూ.7 వేల రూపాయలు జమ చేశారు.

PM Kisan Annadata Sukhibhava Funds | పల్నాడు: ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసింది. పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం కింద  46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో తొలి విడతగా రూ.7వేల చొప్పున జమ చేసింది. పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయగా ఇక్కడ రైతులతో కలిసి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా కార్యక్రమాన్ని వీక్షించారు. రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు  అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, అందర్నీ కష్టాల్లోకి నెట్టడం తప్ప ఆ గొడ్డలి పార్టీకి మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో శనివారం నాడు ఏర్పాటు చేసిన ‘పీఎం కిసాన్‌- అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని నిధులు విడుదల చేసి, అనంతరం ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు, స్వచ్ఛాంధ్ర, అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ లాంటి 3 అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తామని ప్రజలకు మాటిచ్చాం. రైతుల కష్టాలు తీరుస్తామన్న మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఇక్కడ బటన్ నొక్కగానే 99.8 శాతం మంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమయ్యాయి. తొలి విడత  7 వేల చొప్పున మొత్తం రూ.3,125 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం.

Also Read: ChandraBabu Yoga With Ramdev Baba: అమరావతిలోని ఉండవల్లి గుహల్లో యోగాంధ్ర వైబ్స్! రామ్‌దేవ్ బాబాతో కలిసి సీఎం చంద్రబాబు యోగాసనాలు!

గత ప్రభుత్వం ధాన్యం విక్రయిస్తే ఆరు నెలలైనా డబ్బులు రైతులకు అందేవి కావు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 48 గంటల్లోనే రైతుల సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే వరి సాగుకు, తెలంగాణ మెట్ట పొలాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. ఇప్పుడు ఏపీ కంటే తెలంగాణలోనే వరి ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. రసాయన ఎరువుల నుంచి ప్రకృతి సేద్యం వైపు మళ్లాల్సిన అవసరం వచ్చింది.


Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

రసాయనాలు ఎక్కువగా వాడితే భవిష్యత్తులో ఇతర దేశాలు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం తగ్గిస్తాయి. లాభాలు అందించే పామాయిల్ తోటల సాగును రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చామని’ చంద్రబాబు పేర్కొన్నారు. లింగంగుంట్లలోని ప్రజావేదిక సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాళ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు.. జాతీయ నూనెగింజలు, ఆయిల్ పామ్ మిషన్ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.

అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
- రైతులు అధికారిక వెబ్‌సైట్ annadathasukhibhava.ap.gov.in ను సందర్శించాలి. 
-  హోం పేజీలో కనిపించే Know Your Status మీద క్లిక్ చేయాలి. వేరే పేజీకి రీ డైరెక్ట్ అవుతుంది.
-  ఆ పేజీలో ఆర్థిక సంవత్సరం, ఆధార్ నెంబర్, ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి
-  ఆ తరువాత సెర్చ్ (Search) మీద క్లిక్ చేయాలి.
-  మీ అన్నదాత సుఖీభవ నిధుల సమాచారం మీ స్క్రీన్‌పై వస్తుంది. 
-  సక్సెస్‌ అని వస్తే డబ్బులు జమ అవుతాయి. పెండింగ్ లేదా రిజెక్ట్ అని వస్తే డబ్బులు ఇంకా జమ కాలేదని అర్థం.

వాట్సాప్ ద్వారా స్టేటస్ తెలుసుకోండి
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు స్కీముల వివరాలతో పాటు అన్నదాత సుఖీభవ స్టేటస్ సైతం చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో 95523 00009 నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయాలి. అనంతరం మీకు సేవలు (Services) ఎంచుకోండి అని వస్తుంది. అందులో అన్నదాత సుఖీభవ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, ఆధార్ నెంబర్, వివరాలు ఎంటర్ చేస్తే మీ నగదు స్టేటస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget