అన్వేషించండి

AP Annadata Sukhibhava Status: ఏపీలో అన్నదాత సుఖీభవపై లేటెస్ట్ అప్‌డేట్! ఖరీఫ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడు ఇస్తారంటే?

ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు లభించే 20వేల పెట్టుబడి సాయం, ఖరీఫ్‌ విడత ఎప్పుడు విడుదలవుతుంది. షెడ్యూల్‌, ఈకేవైసీ ప్రాసెసింగ్‌, పేమెంట్‌ స్టేటస్‌ చెక్ చేసే విధానం గురించి తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకం రైతుల పెట్టుబడి సాయం.
  • ప్రతి రైతుకు ఏటా ₹20,000 ఆర్థిక సాయం, మూడు విడతల్లో.
  • ఖరీఫ్ తొలి విడత నిధులు జూన్/జులైలో విడుదల కానున్నాయి.
  • అర్హత, చెల్లింపు వివరాలు ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

AP Annadata Sukhibhava Status: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గతంలో ఉన్న పెట్టుబడి సాయం పథకాలను పునర్వ్యవస్థీకరించి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలుస్తోంది. 

సాధారణంగా వ్యవసాయం అంటేనే పెట్టుబడితో కూడిన రిస్క్‌. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతుకు అడుగడుగునా ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలను గుర్తించి, సకాలంలో పెట్టుబడి సాయంతో అందిస్తే సాగు లాభసాటిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఏటా ఇచ్చే ఆర్థిక సాయాన్ని 20వేలకు పెంచుతూ గత ఏడాది  నుంచి నగదు ఇస్తోంది. 

రాష్ట్రంలో సుమారు 46.85 లక్షల మంది రైతు కుటుంబాలకు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. ఇలాంటి తరుణంలో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం ఒక రక్షణ కవచంలా పని చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను భారీగా జోడించి ఈ అన్నదాత సుఖీభవను రూపొందించింది. 

నిధులు ఎప్పుడు విడుదల అవుతాయి?

ప్రస్తుతం రైతులంతా 2026-27 వ్యవసాయం సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్‌ సీజన్ మొదటి విడత కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ లేదా జులై నెలలో ఈ నిధులు విడుదల చేయడానికి వ్యవసాయం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సాధారణంగా జూన్ నెలలో వర్షాలు మొదలై విత్తనాలు వేసే సమయం కాబట్టి, ఈ సమయంలో ఇచ్చే సాయం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. క్షేత్రస్థాయిలో అర్హులైన రైతుల జాబితా రూపకల్పన, ఈకేవైసీ ప్రక్రియను, రెవెన్యూ భూ రికార్డుల పరిశీలన ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. 

గత ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే చివరి విడత నిధులను ప్రభుత్వం మార్చి 13న ఉగాది కానుకగా విజయవంతంగా పంపిణీ చేసింది. 

ఈ పథకం కింద రైతులకు అందే ఇరవై వేలు ఒకేసారి కాకుండా సాగు అవసరాలకు అనుగుణంగా మూడు విడతల్లో అందుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. 

విడత   పంపిణీ సమయం మొత్తం ఉద్దేశం
మొదటి విడత(ఖరీఫ్) జూన్/జులై 7000/7500 విత్తనాలు, ఎరువుల కొనుగోలు
రెండో విడత(రబీ) అక్టోబర్‌/నవంబర్‌ 6000/7000 శీతాకాల పంటల సాగుకు సాయం 
మూడో విడత(సమ్మర్)   ఫిబ్రవరి/మార్చి 6000 ముగింపు విడత(పీఎం కిసాన్‌తో కలిపి)

గత విడతలో సుమారు 46.85 లక్షల మంది రైతులు 6000 చొప్పున లబ్ధి పొందారు. 

మీ పేమెంట్ స్టేటస్‌, అర్హత ఎలా చెక్ చేయాలి?

సాంకేతికతను జోడించి ప్రభుత్వం ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా మార్చింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా మీ మొబైల్‌ ద్వారా స్టాటస్ తెలుసుకోవచ్చు. ముందు అధికారిక annadathasukhibhava.ap.gov.in పోర్టల్‌ను సందర్శించాలి. హోమ్‌ పేజీలో కనిపించే Know Your Status లేదా Beneficiary Detailsపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చే వన్‌టైమ‌ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేసి సబ్మిట్‌ చేస్తే, మీ పేమెంట్‌ విజయవంతమైందా లేదా పెండింగ్‌లో ఉందా అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 

నిధులు మీ ఖాతాలో కొన్ని విషయాలు చెక్ చేయాలి

మీ ఆధార్ నెంబర్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు, మీ భూమి రికార్డులకు లింక్ అయ్యి ఉండాలి. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు అర్హులై ఉండి కూడా జాబితాలో పేరు లేకపోయినా, లేదా సాంకేతిక సమస్యలు ఎదురైనా వెంటనే మీ గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. 

ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు భరోసా కల్పించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక గ్రామం లేదా వార్డు సచివాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. 

Frequently Asked Questions

అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఎంత ఆర్థిక సహాయం అందుతుంది?

ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నిధులకు రాష్ట్ర వాటాను జోడించి అందిస్తారు.

అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతులకు ఎలా పంపిణీ చేయబడతాయి?

ఈ పథకం కింద రూ.20,000 ఆర్థిక సాయం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందుతుంది. మొదటి విడత ఖరీఫ్‌కు జూన్‌/జులైలో, రెండో విడత రబీకి అక్టోబర్‌/నవంబర్‌లో, మూడో విడత సమ్మర్‌కు ఫిబ్రవరి/మార్చిలో చెల్లిస్తారు.

అన్నదాత సుఖీభవ పథకం పేమెంట్ స్టేటస్‌ను ఎలా చెక్ చేయాలి?

అధికారిక annadathasukhibhava.ap.gov.in పోర్టల్‌ను సందర్శించి, 'Know Your Status' లేదా 'Beneficiary Details'పై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్, OTP ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.

అన్నదాత సుఖీభవ నిధులు పొందేందుకు రైతులు పాటించాల్సిన ముఖ్యమైన నిబంధనలు ఏమిటి?

ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాకు, భూమి రికార్డులకు లింక్ అయి ఉండాలి. వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. సమస్యలుంటే వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget