అన్వేషించండి

AP Cabinet Meet : ఏపీ కేబినెట్ భేటీ మూడో తేదీకి వాయిదా- కారణం ఏమిటంటే ?

ఏపీ కేబినెట్ భేటీని మూడో తేదీకి వాయిదా వేశారు. కొంత మంది మంత్రులు రైలు ప్రమాద సహాయ చర్యల్లో ఉన్నందున వాయిదాకు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వంతెలిపింది.


AP Cabinet Meet :  ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశాన్ని మూడో తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం రైలు ప్రమాదం. రైలు ప్రమాద ఘటనలో సహాయ కార్యక్రమాలను కొంత మంది మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. అందుకే కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని బావిస్తున్నారు.                

ఏపీ కార్యనిర్వాహణ రాజధానిగా విశాఖను ప్రకటించిన జగన్‌ సర్కార్‌... 2024 ఎన్నికల ముందు వేగంగా అడుగులు వేస్తోంది. న్యాయపరమైన అడ్డంకులు ఉన్నా... విశాఖ  నుంచి పరిపాలన చేసేందుకు సిద్ధమువుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం నివాసంతోపాటు... ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసును విశాఖకు తరలించి అక్కడి నుంచే పాలన చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో అనుకున్నదే అయినా... అడుగులు మాత్రం ముందుకు పడలేదు. కానీ... ఏడాది నుంచి విశాఖకు షిఫ్ట్‌ అయ్యేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సీఎం జగన్‌. దసరాకు విశాఖకు వెళ్లిపోవాలనుకున్నారు. కానీ... ఏమైందో ఏమో.. మళ్లీ డిసెంబర్‌కు వాయిదా వేసుకున్నారు. డిసెంబర్‌లో విశాఖకు మారిపోతానని సీఎం జగన్‌ ప్రకటించారు. ఈసారి మాత్రం విశాఖకు మారడం పక్కా అంటున్నాయి వైసీపీ వర్గాలు.                          

డిసెంబర్‌లో విశాఖకు మారుతానన్న సీఎం జగన్‌ ప్రకటనతో...మూడో తేదీన  ఏపీ కేబినెట్‌ భేటీపై కూడా ఆసక్తి రేగుతోంది. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా విశాఖకు రాజధాని తరలింపుపైనే చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. డిసెంబర్‌లో విశాఖకు మారుతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారు. కానీ.. ఏ రోజున అన్నది మాత్రం ఇంకా ఫిక్స్‌ కాలేదు.  మరోవైపు... రాజధానిలో వసతులు, సౌకర్యాలపై పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విశాఖలో పర్యటిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం మార్పు,  అందుకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలకు సంబంధించి అందుబాటులో ఉన్న భవనాలు, నిర్మాణాలను పరిశీలిస్తోంది. సీఎం కార్యాలయం ఎక్కడ ఉండాలి, ఏ శాఖలు  విశాఖకు రావాలి, వస్తే ఆయా శాఖల కార్యదర్శులు, విభాగ అధిపతులు ఎక్కడ ఉండాలి అనేది కూడా కమిటీ పరిశీలిస్తోంది. ఈ కమిటీ కూడా కేబినెట్‌ భేటీలోగా నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం.                                       

ఇక.. ఈనెల మూడో తేదీన మొదటి బ్లాక్‌లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈమేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు ఈనెల 27వ తేదీలోపు సాధారణ పరిపాలన విభాగానికి పంపాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Embed widget