By: ABP Desam | Updated at : 08 May 2022 03:16 PM (IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
AP Cabinet Meeting: అమరావతి.. ఈ నెల 13న ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత జరగనున్న మొదటి క్యాబినెట్ భేటీ ఇది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన బిల్లుల గురించి కేబినెట్ చర్చింనుంది.
ఏపీ రాష్ట్ర మంత్రివర్గం మే 13న సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసే పలు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించనుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత జరుగుతున్న మొదటి క్యాబినెట్ భేటీ ఇది. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో ఎదుర్కొంటున్న విద్యుత్ కోతల నివారణ, మే నెలలో మంచి నీటి ఎద్దడి, పోలవరం ప్రాజెక్ట్ వంటి విషయాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. పరిశ్రమలకు భూముల కేటాయింపులతో పాటు రాష్ట్ర మూడు రాజధానుల ప్రక్రియను వేగవంతం చేయడంపై ఏపీ సర్కార్ ఫోకస్ చేస్తో్ంది. సంక్షేమ పథకాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే దిశగా కొత్త నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది.
సచివాలయం వేదికగా..
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయం వేదికగా నూతన మంత్రివర్గం బేటీ కానుంది. కొత్త మంత్రులు అందరూ బాధ్యతలు స్వీకరించి తమ శాఖలపై సమీక్షలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. సీఎం జగన్ తమకు కేటాయించిన జిల్లాల బాధ్యతలు నిర్వర్తిస్తూ పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు కొత్త మంత్రులు. కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అంశాలు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేయాలని సీఎం ఆఫీసు అన్ని శాఖలు, విభాగాధిపతులకు ఇదివరకే సర్కులర్ జారీ చేసింది.
పొత్తుల అంశాలపై చర్చ జరుగుతుందా ?
ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు పదే పదే పొత్తుల గురించి ప్రస్తావించడం, అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని వ్యాఖ్యానించడం అధికార వైఎస్సార్‌సీపీలో చర్చకు కారణమైంది. ఇప్పటివరకూ ఓ ఎత్తు, ఇకనుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు పరిపాలన మరో ఎత్తు అని కొత్త కేబినెట్‌లో జగన్ మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఏపీలో కీలకమైన పోలవరం ప్రాజెక్టును జల వనరులశాఖ కొత్త మంత్రి అంబటి రాంబాబు ఇదివరకే పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గురించి, పనుల పురోగతిపై ఏపీ కేబినెట్ భేటీలో కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రం చేస్తున్న అప్పుడు, ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు సమకూర్చడం లాంటి విషయాలు చర్చకు రానున్నాయి.
Also Read: Bandla Ganesh Vs Vijaysai Reddy : బండ్ల గణేష్ వర్సెస్ విజయసాయి రెడ్డి, మరోసారి ట్వీట్ వార్
CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్ ప్రారంభం
Top Headlines Today: సాగర్ ప్రాజెక్టు నుంచి దౌర్జన్యంగా నీటి విడుదల! కవిత, రేవంత్‌లపై ఈసీకి ఫిర్యాదులు
Chandrababu Case : డిసెంబర్ 12వ తేదీకి చంద్రబాబు కేసు వాయిదా - క్వాష్ పిటిషన్‌పై తీర్పు ప్రాసెస్‌లో ఉందన్న సుప్రీంకోర్టు !
Nagarjuna Sagar Issue : సాగర్ వద్ద తెలంగాణ వాహనాలకు నో ఎంట్రీ - బోర్డర్ వద్ద ఫుల్ సెక్యూరిటీ
AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?
Telangana Assembly Election 2023: 1 గంటకు 36.68 % పోలింగ్ - అత్యధికంగా మెదక్ - అతి తక్కువ హైదరాబాద్!
Telangana Elections 2023: మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం, ఓటర్లు నిలదీయడంతో పోలింగ్ బూత్ నుంచి బయటకు!
Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!
Fact Check: ఆలియా భట్ డీప్‌ఫేక్ వీడియో - ఫస్ట్ పోస్ట్ ఇండోనేషియాలో, వాస్తవాలు ఇవే
/body>