అన్వేషించండి

Tammineni Seetharam : చంద్రబాబు యాత్రలు అసమర్థుడి అంతిమయాత్రలు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం : స్పీకర్ తమ్మినేని సీతారాం

Tammineni Seetharam : వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఫినిష్ అని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. ప్రజల బాదుడే బాదుడుతో చంద్రబాబు సంగతి ముగుస్తుందన్నారు.

Speaker Tammineni Seetharam : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన కామెంట్స్ చేశారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పని అయిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బాదుడే బాదుడుతో టీడీపీ(TDP) సంగతి ముగుస్తుందన్నారు.  చంద్రబాబు యాత్రలు అసమర్థుడి అంతిమయాత్ర అని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల(Electricity Charges) గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే హాస్యాస్పదం అన్నారు. బషీర్ బాగ్ లో పోలీస్ కాల్పులతో(Police Firing)  రైతులు మరణానికి కారకుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబును బషీర్ బాగ్ రక్తం మరకలు నేటికి వెంటాడుతున్నాయన్నారు. 

ఆ రక్తపు మరకలు  

ఆరోజు విద్యుత్ ఛార్జీల పెంపుతోనే బషీర్ బాగ్ లో రైతులు ఉద్యమం చేసిందని స్పీకర్ తమ్మినేని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే  బట్టలు ఆరబెట్టడానికా అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబు ఇవాళ విద్యుత్ ఛార్జీల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని స్పీకర్ జోస్యం చెప్పారు.  మూడు సార్లు ప్రజలు అధికారం ఇస్తే పరిపాలించుకోలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. అసమర్ధుడుని అందలం ఎక్కిస్తే ఏంజరుగుద్దో చంద్రబాబు హయాంలో ప్రజలకు తెలిసిందన్నారు. ఇచ్చినమాట తప్పకుండా క్యాలెండర్ ప్రకటించి క్లియర్ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)ది అన్నారు. మ్యానిఫెస్టోని సైతం టీడీపీ సైట్ లోంచి తీసివేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. 

అసమర్థుడి అంతిమయాత్ర

"ఈ ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం. గతంలో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా యాత్ర చేస్తే బస్సులో పెట్టి బాదినట్టున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఫినీష్. చంద్రబాబు అసమర్థుడు. సీఎం జగన్ కేవలం మూడేళ్లలో చెప్పింది చేసి చూపించారు. మేనిఫెస్టోలో ప్రకటించినవి అన్ని క్లియర్ చేస్తున్న వ్యక్తి జగన్. ఇవాళ ఎవరు సమర్థుడో ప్రజలకు తెలుసు. చంద్రబాబుది అసమర్థుడి అంతిమాత్ర" అని స్పీకర్ అన్నారు.  

"సృష్టికే దివ్య సందేశం అందించి, భగవద్గీత బోదించిన శ్రీకృష్ణుడు బీసీ, కురు సామ్రాజ్య పితామహుడు ఓ ఫిషర్ మాన్.. బీసీ,  రామాయాణాన్ని అందించిన వాల్మీకి సైతం బీసీ, భారతదేశం సమస్థం బీసీలమయం.  ఇవన్నీ చారిత్రాత్మక వాస్తవాలు. ఇవి కాదంటే  చరిత్ర క్షమించదు. భగీరథుడు  ఓ పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన మహార్షి. గంగను భూమికి దించిన భగీరథుడు సైతం బీసీ. ఆయనను గుర్తుచేసుకోవడం కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యం మహోన్నతం" అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget